Yash Reaction About Criticism On Ramayana VFX : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'రామాయణ'. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రామునిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణునిగా... నితీశ్ తివారీ దర్శకత్వంలో మైథలాజికల్ ఎపిక్ భారీ స్థాయిలో రూపొందుతోంది. రీసెంట్‌గా శ్రీరామునిగా రణబీర్ కపూర్ లుక్ రివీల్ చేయగా ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే, వీఎఫ్ఎక్స్‌పై కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా యశ్ రియాక్ట్ అయ్యారు.

'వర్క్ ఇన్ ప్రోగ్రెస్'

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన సినిమాకాన్ ఈవెంట్‌లో రామాయణ గురించి యశ్ మాట్లాడారు. VFXపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. 'రామాయణ VFX వర్క్స్ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. DNEG కంపెనీ విజువల్స్, VFXపై వర్క్ చేస్తోంది. మీరు మాట్లాడుతున్న ఫోటో రియలిస్టిక్, విజువల్స్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తున్నారు. ఫైనల్ అవుట్ పుట్ చూస్తే అద్భుతంగా ఉంటుంది.' అని చెప్పారు.

ఫస్ట్ పార్ట్ స్టోరీ ఏంటంటే?

ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌లో రణబీర్, తాను స్క్రీన్ షేర్ చేసుకోమని చెప్పాారు యశ్. 'మొదటి భాగంలో మేమిద్దరం తెరపై కలిసి కనిపించం. మీకు తెలిసినట్లుగానే ఇది రెండు భాగాల చిత్రం. మొదటి భాగంలో రావణుడిగా నాాకు లంక అనే సొంత రాజ్యం ఉంటుంది. అలాగే, రాముడికి తన సొంత రాజ్యం ఉంటుంది.' అని చెప్పారు.

దీంతో ఫస్ట్ పార్ట్‌లో శ్రీరాముని పుట్టుక నుంచి అయోధ్య, విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులు వెళ్లడం, శివదనుర్భంగం, సీతారాముల కల్యాణం వంటి అంశాలు చూపించనున్నట్లు తేలిపోయింది. రామాయణ ఇతిహాసానికి కేంద్ర బిందువైన రామ రావణ యుద్ధాన్ని పూర్తిగా రెండో పార్టులోనే చూపించనున్నారు. 'రామాయణ' మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి అంటే అక్టోబర్ చివరి వారంలో రానుందని యశ్ తెలిపారు.

Also Read : ఓ వారణాసి... ఓ బాహుబలి... రావు బహదూర్ - క్షుద్రపూజలు కూడా చేశా... సత్యదేవ్ కామెంట్స్ వైరల్