Ramappa Temple: చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం

1 month ago 3
ARTICLE AD

Somasutra at Ramappa Temple |  యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం గర్భాలయంలో అభిషేకాల అనంతరం అభిషేక జలాన్ని బయటకు పంపేందుకు ఉద్దేశించిన ప్రాచీన సోమసూత్రాన్ని భారత పురావస్తు సర్వేక్షణ (ASI), హైదరాబాద్ సర్కిల్ విజయవంతంగా పునరుద్ధరించింది.

దశాబ్దాల కాలం క్రితం సోమసూత్రం మూసుకుపోవడం వల్ల ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకాలు నిర్వహించడానికి ఆటంకం ఏర్పడింది.ఈ పునరుద్ధరణ పనులను విధ్వంసం లేని, శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులను అవలంబించి చేపట్టారు ఆధునిక పరికరాల ఉపయోగించారు.

ఈ ప్రక్రియలో అంతర్గత అడ్డంకులకు సంబంధించి శాస్త్రీయ 3D మ్యాపింగ్, ఎండోస్కోపిక్ కెమెరాలు, GoPro కెమెరాలతో రియల్-టైమ్ మానిటరింగ్ స్క్రీన్ల ద్వారా తనిఖీ చేశారు. దేవాలయ అసలు నిర్మాణానికి ఎటువంటి నష్టం కలగకుండా సాఫ్ట్-డ్రిల్లింగ్ విధానంలో పొరలు పొరలుగా అడ్డంకులను జాగ్రత్తగా తొలగించారు.

ఈ పనులు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో, ASI హైదరాబాద్ సర్కిల్ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు.
ఆలయంలో
పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు సోమసూత్రం పూర్తిగా పనిచేసే స్థితిలో ఉంది. భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకాలు నిర్వహించుకోవచ్చు.

సోమసూత్ర పునరుద్ధరణలో
పురావస్తు శాఖ డీఈ కృష్ణ చైతన్య, సీఏలు మల్లేష్, అజిత్, వంశీకృష్ణ, దేవాదాయ శాఖ ఈవో ఇమ్మడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read Entire Article