Stunt Choreographers Ram Lakshman Talks About Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేయగా.. ఈ చిత్రం 2D, 3D రెండు ఫార్మాట్లలో 5 డిసెంబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్ర ప్రొమోషన్స్‌లో భాగంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

వారు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో మొదటి పార్ట్‌కు మించిన యాక్షన్ ఉంటుంది. అందులో బాలకృష్ణ పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో డైరెక్టర్ బోయపాటి అఖండ విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రను ఢీ కొట్టాలంటే ప్రత్యర్థి పాత్ర కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటి విలన్ పాత్రలో ఆది పినిశెట్టి అద్భుతంగా నటించారు. డైరెక్టర్ ఆయనకు చాలా కొత్త గెటప్ ఇచ్చారు. ఆది పినిశెట్టి దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది. అలాంటి రెండు శక్తులు మధ్య యాక్షన్‌ని క్రియేట్ చేయడానికి, కొత్తగా కంపోజ్ చేయడానికి మాకు చాలా స్పేస్ దొరికింది. అఖండకు మించిన స్పాన్, కాన్వాస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయాలని బోయపాటి చాలా హోంవర్క్ చేశారు. ప్రతి చిన్న విషయంపై 100 శాతం ఎఫర్ట్ పెట్టారు. అందరం చాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ప్రేక్షకులు, అభిమానులు 100 శాతం అంచనాలు పెట్టుకుంటే.. ఈ సినిమా వెయ్యిశాతం ఆ అంచనాలను అందుకునేలా ఉంటుంది.

Also Read : స్మాల్ మూవీ... బిగ్ సక్సెస్ - 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీకి 3 రోజుల్లోనే ఊహించని కలెక్షన్స్

ట్రైలర్‌లో గన్ త్రిశూలంతో గన్ పేల్చే యాక్షన్ సీక్వెన్స్‌ని చూసే ఉంటారు. మామూలుగా అయితే గన్‌కే ఒక పవర్ ఉంటుంది. ఆ గన్‌కు త్రిశూలం పవర్, శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందో.. ఆ పవర్‌తో యాక్షన్ సీక్వెన్స్‌ని కంపోజ్ చేశాం. ఓంకారం శక్తి, శివశక్తిని గుండెల్లో నింపుకుంటే జీవితం ఎంత ఆనందంగా, అద్భుతంగా ఉంటుందో.. ఇందులో బోయపాటి అద్భుతంగా చెప్పారు. మహా కుంభమేళా హిందూ ధర్మానికి ఒక జ్యోతిలా వెలిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. అలాంటి కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం మాకొక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా కోసం విభూదిని కొన్ని టన్నులు వాడాము. సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు ప్రేక్షకుల మీద విభూది వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అంత గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులంతా ఒక వైబ్రేషన్‌తో ఉంటారు. శివతత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇది. ఇందులో మూడు వేరియేషన్స్‌లో ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ అద్యంతం అలరిస్తుంది.

బాలయ్య బాబుతో మేము ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాం. మేమంటే ఆయనకు చాలా నమ్మకం. మేము ‘సింహా, లెజెండ్ వంటి మాస్ పాత్రలకి ఫైట్స్ డిజైన్ చేశాము. అలాంటి మాస్ పాత్రకి ఒక డివైన్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో.. ఆ ఎనర్జీ‌ని తీసుకుని ఇందులో ఫైట్స్ కంపోజ్ చేశాం. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు అందరికీ గూస్‌బంప్స్ వస్తాయి. బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఆయనొక అద్భుతం. మేము మంచులో నాలుగు ఐదు కోట్లు వేసుకుని షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. ఆయన మాత్రం పాత్రకు తగ్గట్టు స్లీవ్ లెస్‌లో ఆ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చేశారు. పాత్రలో అంతగా లీనమయ్యే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే నటుడు మనకు ఉండడం గర్వకారణం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇది బాలయ్య తప్పితే ఇంకెవరూ చేయలేరని అంటారు. ఆయనని షూటింగ్‌లో ఎదురుగా చూస్తున్నప్పుడు ఒక దైవ శక్తిని చూస్తున్నట్టుగా అనిపించేది. ఆయన కూడా ఎప్పుడూ అభిమానులకు రియల్‌గా కనిపించాలి, అభిమానుల్ని అలరించాలనే తపనతో ప్రతి షాట్ ఆయనే చేశారు. ఇందులో 99 శాతం ఆయనే చేశారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అటువంటిది. ఆయనే చేయాలి తప్పితే డూప్‌కు కూడా ఆస్కారం లేదు.

Also Read : చరిత్ర చూడని వారియర్ 'స్వయంభు' - నిఖిల్ హిస్టారికల్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఇండియన్ సినిమా యాక్షన్స్‌లో రకరకాల ఫార్మేట్స్ వచ్చాయి. ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు మా ఎమోషన్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌గా మా అబ్బాయి కూడా వస్తున్నాడు. తన పేరు రాహుల్. త్వరలోనే యాక్షన్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. తను ఇప్పటికే చాలా మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటాడు. ప్రతి రంగంలో కాంపిటేషన్ ఉండాలి. మనమే ఉంటే అహంకారం వస్తుంది. పక్కన పోటీ కూడా ఉంటే భయం వస్తుంది. కొత్త కొత్త స్టైల్స్ రావాలని కోరుకుంటాము. దాని నుంచి మేము కూడా అప్డేట్ అవుతుంటాము. అప్పుడే క్రియేటివిటీ లెవల్స్ పెరుగుతాయి. నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఫైనల్‌గా.. మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా శివుడి శక్తి ఇంత అద్భుతంగా ఉంటుందా అని గర్వపడేలా ఈ సినిమా ఉండబోతుంది. అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూడండి’’ అని తెలిపారు.

Also Read: ధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు... మరణించిన రోజే ఫస్ట్ లుక్.... పోస్టర్ చూసి ఫ్యాన్స్‌ ఎమోషనల్