Ram Charan Top Action Movies : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.181.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఆయన నటించిన టాప్ 7 యాక్షన్ ఎంటర్టైనర్స్ ఓటీటీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓసారి చూస్తే...

రాజమౌళి 'మగధీర'

రామ్ చరణ్ కెరీర్‌లో ఫస్ట్ బెస్ట్ హిట్‌గా నిలిచింది మగధీర. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 400 ఏళ్ల నాటి ప్రేమకథ, పునర్జన్మలో మళ్లీ తమ ప్రేమ కోసం పుట్టిన యువతీ యువకుల కథ. చరణ్ సరసన కాజల్ అగర్వాల్, దేవ్ గిల్, శ్రీహరి, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

యాక్షన్ డ్రామా 'రచ్చ'

రామ్ చరణ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ కామెడీ రచ్చ. సంపత్ నంది దర్శకత్వం వహించగా... అజ్మల్ అమీర్, ముకేష్ రిషి, దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, నాజర్, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

యాక్షన్ కామెడీ 'నాయక్'

చరణ్ డబుల్ రోల్‌లో నటించిన యాక్షన్ కామెడీ మూవీ నాయక్. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కలకత్తాలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు యత్నించిన తన బావను చంపేసిన వారికి ఎదురెళ్లిన ఓ యువకుడి కథే నాయక్.

Also Read : Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్

యాక్షన్ థ్రిల్లర్ 'ఎవడు'

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్‌ ఎవడులో రామ్ చరణ్ సరసన శ్రుతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ క్యామియో రోల్‌లో నటించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ రోల్ చేయగా... రాహుల్ దేవ్, జయసుధ, కోట శ్రీనివాసరావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది.

ధ్రువ

రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‍గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధ్రువ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు. అరవింద్ స్వామి విలన్ రోల్ చేయగా... నవదీప్, పోసాని కృష్ణ మురళి, షియాజి షిండే తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రంగస్థలం'

రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వం వహించగా... జగపతిబాబు విలన్ రోల్ చేశారు. ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషించారు. 1980 ప్రాంతంలో జరిగిన స్టోరీ. ఊరిలో సర్పంచ్ దౌర్జన్యానికి ఎదురు తిరిగిన అన్నయ్య, అతనికి సపోర్ట్‌గా తమ్ముడు ఏం చేశాడు అనేదే స్టోరీ.

రాజమౌళి 'RRR'

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ RRR. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Divi Vadthya : బిగ్ బాస్ దివి గ్లామరస్ లుక్ - పెద్ది రొమాంటిక్ సాంగ్ లిరిక్‌తో...

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.