<p>ECI Rajya Sabha Elections | న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ బుధవారం విడుదల అయింది. తెలంగాణ నుంచి 2 రాజ్యసబ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 26న ఈ రాజ్యసభ ఖాళీ కానున్న స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. పది రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్‌ 9కి తెలంగాణ నుంచి కేఆర్‌ సురేశ్‌రెడ్డి, అభిషేక్‌ సింఘ్వీల రాజ్యసభ పదవీ కాలం పూర్తికానుంది. </p>