Huge Confusion Over Rajinikanth Kamal Haasan Thalaivar 173 Movie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబోలో మూవీస్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ప్రాజెక్టును కమల్ నిర్మిస్తుండగా... మరో మూవీలో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.

డైరెక్టర్‌పై కన్ఫ్యూజన్

కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రజనీతో 'Thalaivar 173' (వర్కింగ్ టైటిల్) మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డైరెక్టర్‌గా తొలుత సుందర్ సి పేరు ఖరారైంది. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంటున్నట్లు సుందర్ అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్‌పై పూర్తిగా సంతృప్తి కలిగిన తర్వాతే షూటింగ్‌కు వెళ్తామని చెప్పారు కమల్. ఆ తర్వాత 'డాన్' మూవీ ఫేం సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు.

ఈ మూవీ అద్భుతంగా ఉంటుందని... మేలో షూటింగ్‌కు వెళ్తామని రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో చెప్పారు సిబి చక్రవర్తి. అయితే, తాజాగా ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. స్క్రిప్ట్‌పై రజనీకాంత్ సూచించిన మార్పుల కారణంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు ఓ వాదన వినిపిస్తుండగా... ఫైనాన్షియల్‌ పరంగానూ ఇబ్బందులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సిబి చక్రవర్తి గతంలో ఓ నిర్మాత వద్ద అడ్వాన్స్ తీసుకున్నారని... ఆయన 'తలైవర్ 173'లో భాగం కోరగా కమల్ నిర్మాణ సంస్థ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

కొత్త డైరెక్టర్ ఎవరంటే?

ఈ క్రమంలో డ్రాగన్ ఫేం అశ్వత్ మారిముత్తు తలైవర్ 173 మూవీని తెరకెక్కిస్తారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై మూవీ టీం అఫీషియల్‌గా రియాక్ట్ కావాల్సి ఉంది. ఇద్దరు మల్టీ స్టారర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న సినిమాపై ఎందుకింత కన్ఫ్యూజన్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట క్వశ్చన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Also Read : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...