Rajasekhar Reaction Over Gotila Factory : 'హీరో రాజశేఖర్ బంగ్లాదేశ్, ఇండియా, పాక్‌ల్లో గోటీలు (గోళీలు) అమ్ముతూ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో జాబ్ చేసిన వారికి రూ.లక్షల్లో జీతాలు.' ఇదీ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం. ఇప్పటికే ఈ వీడియోలు, వార్తలపై రాజశేఖర్ భార్య జీవిత రియాక్ట్ అయ్యారు. అవి చూసి నవ్వుకున్నట్లు చెప్పారు. తాజాగా ఈ అంశంపై రాజశేఖరే స్వయంగా స్పందించారు.

'ఇది నిజమా? అని అడిగారు'

రీసెంట్‌గా 'ఇదేమిటమ్మా మాయ మాయ' పాట ట్రెండ్ అయ్యింది. కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' మూవీలో ఈ సాంగ్ రీమేక్ చేయగా సోషల్ మీడియాలో లక్షల కొద్దీ రీల్స్ పుట్టుకొచ్చాయి. దీంతో పాటే గోటీల ఫ్యాక్టరీ వీడియోలు కూడా ట్రెండ్ అయ్యాయి. రాజశేఖర్... గోటీల ఫ్యాక్టరీ ద్వారా రూ.కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నారంటూ ప్రచారం సాగింది. దీనిపై ఏఐ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో దీనిపై రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు.

'రీసెంట్‌గా గోటీల ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటుంటే సంతోషంగానే ఉంది. నాకు అలాంటిదేమీ లేదు. కొందరు అది నిజమేనని అనుకున్నారు కూడా. నాకు బాగా తెలిసిన వాళ్లే ఫోన్ చేసి ఇది నిజమా అని అడిగారు. ఆ వీడియో చూడగానే 'నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా అనుకున్నా.' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

Also Read : 33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?