Actor Rajasekhar Opens Up About His Career Love Movies : యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ రీసెంట్‌గా బైకర్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోస్ మూవీస్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తన సినీ జర్నీలో డాక్టర్ నుంచి యాక్టర్ వరకూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. తాజాగా నటుడు రాజా రవీంద్రతో ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్, మూవీస్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

'శ్రీదేవిని చేసుకోవాల్సింది'

తనతో పెళ్లి కోసం అందాల తార శ్రీదేవిని తన పేరెంట్స్ అడిగినట్లు చెప్పారు రాజశేఖర్. 'నన్ను చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతుంటారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది అని. జీవిత ప్రపోజ్ చేసేలా నేను చేశాను. మా అమ్మ ఓకే చెప్పిన అమ్మాయి, జీవితను తీసుకుని ఓ టెంపుల్‌కు వెళ్లా. వారిద్దరూ కలిసిన తర్వాత తెలిసింది ఒకే స్కూల్ మేట్స్ అని. శ్రీదేవిని కూడా మా పేరెంట్స్ అడిగారు.

ఈ క్యాస్ట్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని మా పేరెంట్స్ అంటున్నారని జీవితకు అన్నీ వివరంగా చెప్పా. అప్పుడు ఆమె ఒకటే అంది. 'మీరు వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం. కానీ నేను మాత్రం వేరే పెళ్లి చేసుకోను. మీ కోసమే ఉంటాను.' అని జీవిత అన్నారు. అలా మా ప్రేమ పెళ్లి పీటల వరకూ సాగింది.' అని చెప్పారు.

Also Read : విష్ణు ప్రియ, అషు రెడ్డి రూటులో శ్రీ రెడ్డి - ఇన్ స్టా గేట్స్ ఓపెన్... ఎంత మంది సబ్‌స్కైబర్స్ అంటే?