Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
1 month ago 3
ARTICLE AD
PM Modi Union Cabinet Decisions | న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించి 5 నూతన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 ప్రాజెక్టులు రైల్వే పరిధిని దాదాపు 540 కిలోమీటర్ల మేర పెంచనున్నాయి. ఆ ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎ) అరక్కోణం- రేణిగుంట 3, 4వ లైన్ - 77 కిలోమీటర్ల ప్రాజెక్ట్
బి) వైట్ ఫీల్డ్- బంగారుపేట 3, 4వ లైన్ - 47 కిలోమీటర్లు
సీ) హోసూర్- ఒమలూర్ డబ్లింగ్ (2 లైన్ల నిర్మాణం) - 147 కిలోమీటర్ల దూరం
డీ) సేలం- కరూర్- దిండిగల్ డబ్లింగ్ - 159 కిలోమీటర్లు
రైలు మార్గాల సామర్థ్యం పెరగటం వల్ల రవాణా సౌలభ్యం మెరుగవుతుంది. దీనివల్ల భారత రైల్వేల నిర్వహణ సామర్థ్యం, సేవలపై నమ్మకం పెరుగుతాయి. రైల్వే కార్యకలాపాల క్రమబద్ధీకరణకు, రద్దీని తగ్గించేందుకు ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దోహదం చేస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న సరికొత్త ఇండియాకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులున్నాయి. సమగ్రాభివృద్ధి ద్వారా ఆ ప్రాంత ప్రజలు "ఆత్మనిర్భర్" ను సాధించటంతో పాటు స్థానికంగా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా మల్టీ మోడల్ అనుసంధానం, రవాణా సామర్థ్యాన్ని పెంపొందించటం ఈ ప్రాజెక్టుల ఉద్దేశం. ప్యాసింజర్స్, సరకులు, సేవల రవాణాకు అంతరాయం లేని అనుసంధానత సాధ్యమవుతుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 ప్రాజెక్టులు
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని 17 జిల్లాల మీదుగా వెళ్లే ఈ అయిదు ప్రాజెక్టులు భారత రైల్వే పరిధిని దాదాపు 540 కిలోమీటర్ల మేర పెంచుతాయి. ఆమోదం పొందిన ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 52 లక్షల జనాభా గల దాదాపు 2,121 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి.
పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు పెరగనున్న కనెక్టివిటీ
ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుల సామర్థ్యం ద్వారా తిరుపతి, సుబ్రమణ్యస్వామి ఆలయం (తిరుత్తణి), శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (తిరుచానూరు), శ్రీ సీతి భైరవేశ్వర స్వామి ఆలయం,కోటిలింగేశ్వర దేవాలయం, బంగారు తిరుపతి, కోలార్ బంగారు గనులు, హోగెనక్కల్ జలపాతం, హోసూర్ కోట, మెట్టూర్ డ్యామ్, సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం, కొడైకెనాల్ కొండలు, నమక్కల్ ఆంజనేయర్ ఆలయం, నమక్కల్ కోట, కళ్యాణ పశుపతేశ్వర ఆలయం, యాదగిరిగుట్ట, భువనగిరి కోట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఆలయం వంటి దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు అనుసంధానం మెరుగవుతుంది .
బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్స్, ఆహారధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు,కంటైనర్లు, ఎరువులు వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టు చాలా హెల్ప్ అవుతుంది. ఈ పెంపుదల ద్వారా ఏటా అదనంగా  ఏడాదికి 47 మిలియన్ టన్నుల సరకు రవాణా సాధ్యమవుతుంది. పర్యావరణహిత, శక్తి సామర్థ్యాలు గల రవాణా వ్యవస్థ రైల్వేలు. దేశ వాతావరణ లక్ష్యాలను చేరుకోవటంలో, రవాణా ఖర్చులను తగ్గించటంలో దోహదం చేస్తాయి. ఇవి చమురు దిగుమతి (సుమారు 8 కోట్ల లీటర్ల)ని తగ్గించి, కర్బన ఉద్గారాలను విడుదలను తగ్గిస్తాయి. సుమారు 2 కోట్ల మొక్కలు నాటటంతో దీని విలువ సమానమని తెలిపారు.
Read Entire Article