Clarity About Allu Arjun's Raaka Comparision With Avatar : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ మైథలాజికల్ టచ్ యాక్షన్ అడ్వెంచర్ రాకా (Raaka). ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ డైరెక్టర్ అట్లీ బర్త్ డే సందర్భంగాా సోమవారం రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ లుక్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేయగా... గ్లింప్స్‌పై అందరిలోనూ అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఈ మూవీలో గ్రాఫిక్స్, విజువల్స్ వేరే లెవల్‌లో ఉండనున్నట్లు తెలుస్తుండగా... ఇంటర్నేషనల్ VFX సంస్థలు అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ భారీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాయి. రీసెంట్‌గా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి హాలీవుడ్ సెన్సేషన్ అవతార్‌ను (Avatar) మించి రాకాలో విజువల్స్ ఉండబోతున్నాయని చెప్పడంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా... దీనిపై హీరో అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు రియాక్ట్ అయ్యారు.

'హడావిడి వద్దు'

రాకా మూవీపై ఓ ఫ్యాన్ పెట్టిన పోస్ట్‌కు బన్నీ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు రిప్లై ఇచ్చారు. 'మూవీ ప్రమోషన్స్‌లో మరీ హడావిడి చెయ్యొద్దు. అవతార్ లాంటి గొప్ప చిత్రాలతో మన సినిమాను పోల్చడం వల్ల ఫ్యూచర్‌లో నష్టం జరుగుతుంది.' అంటూ సదరు అభిమాని కోరారు.

'కంపేరిజన్ చేయలేదు'

దీనిపై అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు రియాక్ట్ అయ్యారు. 'మీ సజిషన్‌కు థాంక్స్. 'గ్లోబల్ ట్రయంఫ్' అనే పదాన్ని ఓ స్పెషల్ కారణంతో మాత్రమే వాడాం. ఆ విషయం త్వరలోనే మీకందరికీ తెలుస్తుంది. ఒక్క విషయం మాత్రం క్లారిటీ ఇస్తున్నా. మూవీ టీం 'రాకా'ను ఎప్పుడూ ఇతర చిత్రాలతో పోల్చలేదు. మేము మాట్లాడం. కంటెంట్ మాట్లాడుతుంది. కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది.' అంటూ రియాక్ట్ అయ్యారు.

Also Read : Crime Thriller OTT : ఓటీటీలోకి రామ్ చరణ్ మెచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

రెండు పార్టులుగా!

'రాకా'లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఆ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉందనే టాక్. అలాగే... జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రష్మిక నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

మరి వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతాన్ని యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట.

స్టోరీ అదేనా?

ఫస్ట్ లుక్‌తోనే 'రాకా' స్టోరీపై వెరైటీ థియరీస్ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. ఈ మూవీ స్టోరీ మూడు డిఫరెంట్ కాలాల్లో సాగుతుందని సమాచారం. వింత క్రూర జంతువులు, సరికొత్త ప్రాణులు కనిపించనున్నాయట. ఈ సినిమాలో బన్నీ ఓ వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పగలు మనిషిగా రాత్రి తోడేలుగా చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా కనిపించబోతున్నారని టాక్. అంతే కాకుండా బన్నీ మూడు రోల్స్‌లో నటించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2028 ప్రారంభంలో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

Also Read : Chiranjeevi Kaaka : మరోసారి చిరు లీక్స్ - 'కాకా'కు కదిరికి లింక్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్... ఫ్యాన్స్ వెయిటింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.