Malayalam Actress Femina Joins Raaka Movie : అల్లు అర్జున్, అట్లీ కాంబో పాన్ వరల్డ్ అడ్వెంచర్ రాకాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తున్నారు. మరో ముగ్గురు హీరోయిన్లు భాగం కానున్నట్లు తెలుస్తుండగా... మలయాళ బ్యూటీ ఫెమినా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా మూవీ ఈవెంట్‌లో వెల్లడించారు.

రాకా టీం నుంచి ఫోన్

ఇంతటి భారీ ప్రాజెక్టులో నటిస్తానని తాను ఊహించలేదని... తన కెరీర్‌లో ఇదే అత్యంత భారీ ప్రాజెక్ట్ అని చెప్పారు హీరోయిన్ ఫెమినా జార్జ్. 'ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నేను బిగ్ ఫ్యాన్. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన నటించిన హ్యాపీ చూసిన నేను బిగ్ ఫ్యాన్ అయిపోయా. సినిమాలో నా పాత్ర చాలా చిన్నదే. అయినా ఇంతటి గొప్ప ప్రాజెక్టులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. రీసెంట్‌గా డిస్కో మూవీ పూర్తి కాగానే రాకా టీం నుంచి నాకు ఫోన్ వచ్చింది.' అని చెప్పారు.

Also Read :