Punjab zombie drug influence : పంజాబ్‌లోని లూథియానాతో పాటు చండీగఢ్, అంబాలా వంటి నగరాల్లో ఇటీవల వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యువకులు వింతగా ప్రవర్తిస్తూ, గంటల తరబడి కదలకుండా ఒకే స్థితిలో ఉండిపోతున్న ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వీరంతా జోంబీ డ్రగ్ బాధితులుగా అనుమానిస్తున్నారు.

అసలేమిటి ఈ జోంబీ డ్రగ్ ?

వైద్య పరిభాషలో దీనిని జైలాజిన్ (Xylazine) అని పిలుస్తారు. సాధారణంగా గుర్రాలు, పశువుల వంటి జంతువులకు శస్త్రచికిత్స చేసేటప్పుడు వాటిని మత్తులోకి దించడానికి పశువైద్యులు దీనిని ఉపయోగిస్తారు. అయితే, డ్రగ్ మాఫియా దీనిని హెరాయిన్, ఫెంటానిల్ వంటి ఇతర మత్తు పదార్థాలతో కలిపి విక్రయిస్తోంది. ఇది తీసుకున్న వ్యక్తి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, వారిని గంటల తరబడి స్పృహ లేని జోంబీ లాగా మార్చేస్తుంది.

What is Narcotics bureau and govt agencies doing , this Zombie drug is rapidly making it way to many Indian cities

This video is from Bhayandar , Mumbai where a man can be seen intoxicated by Zombie Drug . pic.twitter.com/NDiGST1OfX

— Amitabh Chaudhary (@MithilaWaaala) April 14, 2026

వైరల్ వీడియోల కలకలం

ఇటీవల చండీగఢ్‌లో ఒక డెలివరీ బాయ్ రోడ్డుపై బైక్‌ పక్కన సుమారు రెండు గంటల పాటు నిలబడిన చోటే విగ్రహంలా ఉండిపోయాడు. అలాగే లూథియానాలో కూడా ఇద్దరు యువకులు గోడకు ఆనుకుని కదలకుండా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అమెరికాలోని ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో ఈ జోంబీ డ్రగ్ బాధితులు ఎలాగైతే నడి రోడ్డుపై వింతగా ఊగుతూ ఉంటారో, ఇక్కడ కూడా అలాంటి దృశ్యాలే కనిపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

శరీరం కుళ్ళిపోయే ప్రమాదం

ఈ డ్రగ్ అత్యంత ప్రమాదకరమైనది కావడానికి ప్రధాన కారణం అది శరీర చర్మంపై చూపే ప్రభావం. దీనిని ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే, ఆ ప్రాంతంలోని కణజాలం కుళ్ళిపోవడం మొదలవుతుంది. క్రమంగా శరీరంపై నల్లని గాయాలు ఏర్పడి, చర్మం ఊడిపోతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే బాధితుల చేతులు లేదా కాళ్ళను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దీనిని మాంసం తినే డ్రగ్ అని కూడా పిలుస్తారు.

#NEW : Police have launched an investigation in the Mira-Bhayandar area after videos allegedly showing individuals under the influence of Zombie drugs.#MiraBhayandar #Maharashtra #MiraBhayandar #ZombieDrugs #Drugs #DrugAwareness pic.twitter.com/xU10njHGmw

— upuknews (@upuknews1) April 15, 2026

ఈ వీడియోలపై పంజాబ్ , చండీగఢ్ పోలీసులు స్పందించారు. ఆ యువకులు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనారోగ్యం వల్ల అలా అయ్యారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో మితిమీరిన సింథటిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి వింత ప్రవర్తన కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే, జైలాజిన్ వినియోగంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ధృవీకరణ రాలేదని, ప్రజలు అనవసరంగా భయపడవద్దని కోరుతున్నారు. గతంలో పంజాబ్ కేవలం హెరాయిన్ వంటి సహజ డ్రగ్స్‌తో పోరాడేది. కానీ ఇప్పుడు జైలాజిన్ వంటి ట్రాంక్ డ్రగ్స్ ప్రవేశించడం భద్రతా సంస్థలకు సవాలుగా మారింది.