Public Holidays 2025: నూతన సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త ఏడాది సంబరాలకు కొందరు సిద్ధమవుతుంటే..మరికొందరు సంక్రాంతి సంబరాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. 2025లో అధికారిక, ఆప్షనల్ సెలవులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాల అధికారులంతా ఈ సెలవులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

2025 జనవరి 01 బుధవారం వచ్చింది.. ఈరోజు నుంచి సందడి మొదలవుతుంది

జనవరి 2025

2025 జనవరి 13న భోగి పండుగ, 14 న సంక్రాంతి, 14 కనుమ, 16 ముక్కనుమ.. తెలుగువారి అతి పెద్ద పండుగ ఇది.. పండుగ నాలుగు రోజులూ సందడే సండి. అయితే ప్రభుత్వం భోగి 13, 14 సంక్రాంతి రోజు సెలవులు ప్రకటించింది. ఇంకా ఈ నెలలో జనవరి 26 రిపబ్లిక్ డే రోజు సెలవిచ్చింది

ఫిబ్రవరి 2025

ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినం..ఈ రోజు శైవ ఆలయాలు పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోతాయ్

మార్చి 2025

మార్చి 14 హోలీ వచ్చింది.. మార్చి నెలాఖరు ఉగాది, రంజాన్ వరుసగా వచ్చాయ్. మార్చి 30న ఉగాది, 31న రంజాన్ వచ్చింది

Also Read: 2025లో మకర రాశివారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది కానీ !

ఏప్రిల్ 2025

ఏప్రిల్ 1న కూడా రంజాన్ సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న శ్రీరామ నవమి, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే వచ్చింది

జూన్ - జూలై 2025

జూలై నెలలో తెలంగాణ అతిపెద్ద పండుగల్లో ఒకటైన బోనాలు వస్తుంది. జూన్ 07న బక్రీద్, జూలై 06న మొహర్రం, జూలై 21 బోనాలు వచ్చింది

ఆగష్టు 2025

ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం...ఆ మర్నాడే ఆగష్టు 16 శ్రీ కృష్ణాష్టమి వచ్చింది. ఈ రెండు వరుస హాలిడేస్ వచ్చాయ్. ఇదే నెల చివరివారంలో ఆగష్టు 27న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి

సెప్టెంబర్ 2025

సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ, సెప్టెంబర్ 21 బతుకమ్మ పండుగ ప్రారంభ మవుతుంది. ఆశ్వయుజ మాస అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ తొమ్మిదిరోజుల పాటూ ఘనంగా సాగనుంది.

Also Read: 2025లో ధనుస్సు రాశి వారికి అష్టమ శనితో చికాకులు..బృహస్పతి సంచారంతో ఉపశమనం!

అక్టోబర్ 2025

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 3 విజయదశమి, అక్టోబర్ 20న దీపావళి వచ్చింది, అక్టోబరు 21 నుంచి కార్తీకమాసం ప్రారంభం...

నవంబర్ & డిసెంబర్ 2025

నవంబర్ నెలలో సగం రోజుల వరకూ కార్తీకమాసం సందడి సాగనుంది. కార్తీకమాసంలో అత్యంత ముఖ్యమైన కార్తీక పౌర్ణమి నవంబర్ 05న వచ్చింది. డిసెంబర్ 25న క్రిస్మస్, డిసెంబర్ 26న బాక్సింగ్ డే

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆప్షనల్ సెలవుల విషయానికొస్తే...

జనవరిలో 14, 15, 28
ఫిబ్రవరిలో 3, 14
మార్చిలో 21, 28
ఏప్రిల్ 10, 14, 30
మే నెలలో 12వ తేదీ
జూన్ లో 15, 27
జూలైలో 5వ తేదీ
ఆగష్టులో 8, 9
సెప్టెంబర్ లో 30వ తేదీ
అక్టోబర్ లో 1, 4, 19
నవంబర్ లో 16వ తేదీ
డిసెంబర్ లో 24వ తేదీ

ఓవరాల్ గా 2025 మొత్తం సాధారణ సెలవులు 27, ఆప్షనల్ హాలిడేస్ 23...మొత్తం 50 రోజులు సెలువులు...

Also Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!