Director Mahesh Chandra About Preyasi Raave Movie Sequel : ప్రేయసి రావే... సీనియర్ హీరో శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. కట్నం కోసం లవర్స్‌ను విడదీసే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ మహేష్ చంద్ర తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 1999లో వచ్చిన ఈ మూవీ సీక్వెల్ ఇప్పుడు రెడీ అవుతోంది. తాజాగా పిఠాపురంలో (అలా మొదలైంది) మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సీక్వెల్‌పై హింట్ ఇచ్చారు.

తన జీవితాన్ని మలుపు తిప్పిన ప్రేయసి రావే మూవీకి త్వరలోనే సీక్వెల్ చేయబోతున్నట్లు డైరెక్టర్ మహేష్ చంద్ర తెలిపారు. 'సీక్వెల్ కథ రెడీ అవుతోంది. శ్రీకాంత్‌కు ఈ విషయం చెబితే ఆనందంగా ఫీలయ్యారు. పూర్తి వివరాలు త్వరలో చెబుతా. శ్రీకాంత్, రాశి, పృథ్వి, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ మేమంతా కలిసి మళ్లీ పని చేస్తాం.' అని చెప్పారు. దీంతో హైప్ క్రియేట్ అవుతోంది.

పిఠాపురంలో... అదే ఫీలింగ్

ప్రేయసి రావే తనకు లైఫ్ ఇచ్చిందని ఆ మూవీ టీంతో తన కొత్త చిత్రం పిఠాపురంలో అలా మొదలైంది ట్రైలర్ లాంచ్ కావడం ఆనందంగా ఉందని మహేష్ చంద్ర తెలిపారు. ''ప్రేయసి రావే' షూటింగ్ టైంలో ఎలాంటి ఫీల్ అయితే వచ్చిందో... 'పిఠాపురంలో అలా మొదలైంది' టైంలోనూ అదే ఫీలింగ్ వచ్చింది. ఇప్పటివరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్‌కి ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు.

శ్రీరామ్ గొప్ప డైలాగ్స్ రాశారు. ముగ్గురు నిర్మాతలు నాకెంతో సహకరించారు. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ మూవీని చేశాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్ అవుతారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది.' అని అన్నారు.

Also Read : రాకాస స్నేక్ డ్యాన్స్ సాంగ్ - పార్టీ జోష్ పెంచే స్టెప్పులు... షేక్ చేసే లిరిక్స్

మూడు డిఫరెంట్ స్టోరీస్‌తో...

మహేష్ చంద్ర తనతో తీసిన ప్రేయసి రావే అద్భుతమైన విజయం సాధించిందని... అందులో పృథ్వీ, శివాజీ రాజా అద్భుతంగా నటించారని చెప్పారు హీరో శ్రీకాంత్. 'అప్పట్లో కొత్త డైరెక్టరే అయినా గొప్పగా సినిమా తీశాడు. ఈ 'పిఠాపురంలో అలా మొదలైంది' మూడు డిఫరెంట్ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశాడని అర్థం అవుతోంది. పేరెంట్స్ పిల్లలతో కలిసి ఈ మూవీని చూడాలి. సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ప్రేయసిరావే లానే మంచి హిట్ కావాలి.' అని తెలిపారు.

'ప్రేయసి రావే' మూవీతో మహేష్ చంద్రతో పాటు తమకు కూడా వరుస అవకాశాలు వచ్చాయని చెప్పారు నటులు శివాజీ రాజా, పృథ్వీ. పిఠాపురంలో అంటేనే ఓ వైబ్ ఉంటుందని... మంచి మెసేజ్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందించబోతున్నట్లు తెలిపారు. 'పిఠాపురంలో అలా మొదలైంది' మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఆకాంక్షించారు.

'పిఠాపురంలో అలా మొదలైంది' మూవీలో రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.