Prema Entha Madhuram Serial Today Episode: శంకర్‌ కన్వీన్స్‌ చేయడంతో ఎంగేజ్‌మెంట్‌కు అయిష్టంగానే ఒప్పుకున్న అకి కిందకు వచ్చి అందరి కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుని రాకేష్‌ పక్కన కూర్చుంటుంది. ఇంతలో పంతులు మూహూర్త టైం అయింది ఉంగరాలు మార్చుకోండి అని చెప్పగానే అకి బాధగా రింగ్‌ చూస్తుంది. రాకేష్‌ మాత్రం హ్యాపీగా ఫీలవుతుంటాడు. అందరూ టెన్షన్‌గా ఊపిరి బిగపట్టి చూస్తుంటారు. అభయ్‌ నవ్వుతుంటాడు. ఇంతలో రాకేష్‌ .. అకి చేతిని తన చేతిలోకి తీసుకుని రింగ్‌ తొడగబోతుంటే.. బయట నుంచి కంగారుగా శంకర్‌ నారాయణ పరుగెత్తుకొచ్చి మన ఆఫీసులో ఘోరం జరిగిందని మన టెండర్‌ కోట్‌ ఎవరో లీక్‌ చేశారని చెప్తాడు. అందరూ షాక్‌ అవుతారు.

ఓనరు: ఏంటి పెద్దాయన నీకేమైనా తెలివి ఉందా..? ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే మధ్యలో నువ్వేంటి..? పంతులు గారు మీరు కానివ్వండి..

జెండే: ఆగండి పంతులు గారు ముందు ఈ కోట్‌ లీక్‌ చేసింది ఎవరో తెలియాలి. అభి ప్లే చేయ్‌..

అనగానే అభి వీడియో ప్లే చేస్తాడు. అందులో పెద్దొడు, చిన్నొడు శంకర్‌ చాంబర్‌లోకి వెళ్లి టెండర్‌ కోట్‌ కొట్టేసిని వీడియో వస్తుంది. ఆ వీడియో చూసిన రాకేష్‌ కోపంగా శంకర్‌ గారు మీ తమ్ముళ్లు ఇలాంటి వాళ్లా..? జాబ్‌ ఇచ్చిన కంపెనీకే మోసం చేస్తారా..? అంటూ తిడుతుంటాడు.

శంకర్‌: పంతులు గారు ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది.

పంతులు: రాహుకాలం రావడానికి ఇంకా అరగంట టైం ఉందండి. ఆలోపు నిశ్చితార్తం జరిపించాలి.

శంకర్: జెండే సార్‌ మీకు పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నాను. చైర్మన్‌ గా ఇది నా ఆర్డర్‌ సార్‌. తప్పుకు శిక్ష వాయిదా వేయకూడదు. వెంటనే జరిగిపోవాలి.

ఓనరు: అబ్బా శంకర్‌.. జరగాల్సిన ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌ డిస్టర్బ్‌ చేస్తూ ఇప్పుడీ పంచాయతీలు అన్ని అవసరమా.? అంటే ఎంగేజ్‌ మెంట ‌జరిగితే బెటర్‌ కదా అని

శంకర్: జరగుతుంది. అనుకున్న టైంకి.. అనుకున్న వాళ్లతో కచ్చితంగా జరుగుతుంది.

రాకేష్‌: వెళ్లి వాళ్లను పారిపోమ్మని చెప్పు. ఈ టైంలో వాళ్లు శంకర్‌కు దొరికితే కచ్చితంగా వాళ్లతో నిజం చెప్పిస్తాడు.

ఓనరు: అలాగే పార్ట్‌నర్‌

అని బయటకు వెళ్లి చిన్నోడికి ఫోన్‌ చేసి అర్జెంట్‌గా నువ్వు మీ అన్నయ్య సిటీ వదిలి పారపోండి అని కోట్‌ నువ్వు లీక్‌ చేశావని మీ అన్నయ్యకు తెలిసిపోయింది. మిమ్మల్ని తీసుకురమ్మని జెండేను కూడా పంపించాడు పారిపోండి అని భయపెడతాడు. దీంతో ఇద్దరూ భయంతో పారిపోతుంటే జెండే ఎదురు వస్తాడు. జెండేను చూసిన చిన్నోడు, పెద్దోడు షాక్‌ అవుతారు. జెండే వాళ్లిద్దరినీ తీసుకుని ఇంటికి వస్తాడు.

అభయ్‌: మిమ్మల్ని… ఛ ఛ శంకర్‌ గారి ముఖం చూసి ఏమీ చేయలేకపోతున్నాను.

రాకేష్‌: మీ మాయ మాటలు నమ్మీ మీకు హెల్ప్‌ చేస్తే ఇదేనా మీరు చేయాల్సింది.

ఓనరు: వెంటనే వీళ్లను పోలీసులకు పట్టిస్తే.. డిస్టర్బ్‌ లేకుండా నిశ్చితార్థం చేసుకోవచ్చు.

జెండే: అలా ఎలా కుదురుతుంది. తప్పు ఎందుకు చేశారో తెలిసుకోవాలి కదా..?

యాదగిరి: ఏంటి బాబు ఇదంతా మీ అన్నయ్యా మిమ్మల్ని విలువలతో పెంచాడు. మీరిలా తయారయ్యారేంటి…?

రాకేష్‌: అభయ్‌ ముందు వీళ్లను పోలీసులకు పట్టించు..

శంకర్‌: మీరందరూ మాట్లాడ్డం అయిపోయిందా.? ఎందుకురా ఇలా చేశారు. అడిగేది మిమ్మల్నే సమాధానం చెప్పండి. పెంచి పెద్ద చేసిన అన్నయ్యనే మోసం చేశారు సరే రోడ్డున పడ్డ మీకు తిండి పెట్టి ఉద్యోగం ఇచ్చిన రాకేష్‌కు ద్రోహం ఎలా చేశారు.

ఓనరు: పార్ట్‌నర్‌ ఏదో తేడా కొడుతుంది.

రాకేష్‌: నాకు కూడా.. అలాగే అనిపిస్తుంది.

శంకర్‌ కోపంగా తమ్ముళ్లను తిడతాడు. నేను పోలీసులకు ఫోన్‌ చేశాను. వాళ్లు వస్తూ ఉంటారని చెప్పగానే ఇంతలో పోలీసులు వస్తారు. ఎస్సై గారు తీసుకెళ్లి సెల్‌లో పడేయండి అని చెప్పగానే పోలీసులు వెళ్లి రాకేష్‌ను అరెస్ట్‌ చేస్తారు. అందరూ షాక్‌ అవుతారు. ఓనరు అడ్డుపడితే ఓనరుకు కూడా బేడీలు వేస్తారు. అభయ్‌ తప్పు చేసింది వాళ్లు వాళ్లను కదా అరెస్ట్‌ చేయాల్సింది అంటే శంకర్‌ తన తమ్ముళ్లతో నాటకం ఆడింది చెప్తాడు. వాళ్లు ఆఫీసులో జాయిన్‌ అయిన రోజే రాకేష్‌ గురించి మొత్తం నిజం చెప్పారు. అప్పటి నుంచే నాటకం మొదలుపెట్టా అని శంకర్‌ చెప్తాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!" href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_blank" rel="noopener">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!