యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు చూసే వీక్షకులకు ప్రసాద్ బెహరా (Prasad Behara) తెలిసే ఉంటారు. వన్ లైన్ పంచ్ డైలాగులు వేయడంలో స్పెషలిస్ట్. ప్రసాద్ బెహరా కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. 'కమిటీ కుర్రోళ్ళు'తో వెండితెరపై కూడా ప్రసాద్ బెహరా విజయం అందుకున్నారు. యూట్యూబ్ సిరీస్ అయినా, సినిమా అయినా, ఆఖరికి సినిమా వేడుక అయినా సరే నవ్వించే ఆయన... 'పాపం ప్రతాప్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Papam Prathap Pre Release Event)లో ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ప్రసాద్ బెహరా స్పీచ్ వైరల్ అవుతోంది. అసలు ఏమైంది? ఆయన ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? అనే వివరాల్లోకి వెళితే...

మీరు ఏడిస్తే కన్నీళ్ళు... నేను ఏడిస్తే *చ్ఛ కారదు!
ప్రసాద్ బెహరా ఎమోషనల్ స్పీచ్ వెనుక ఉన్న కారణంలోకి వెళ్లే ముందు, 'పాపం ప్రతాప్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఏమన్నారు? అనే అంశంలోకి వెళితే... తన గురించి రాస్తే నాలుగు డబ్బులు వస్తాయని అనుకుంటే ఏమైనా చేసుకోమని, తన గురించి ఏమైనా రాసుకోమని ఘాటుగా స్పందించారు. ''మీరు ఏడిస్తే కన్నీళ్లు... నేను ఏడిస్తే *చ్చ కారదు'' అంటూ పరుషంగా మాట్లాడారు ప్రసాద్ బెహరా. తన గురించి రాస్తే కనీసం తల్లి కూడా ఏడవదు అని, అసలు తన తల్లికి వీడియో ఓపెన్ చేయడం కూడా రాదని ఎమోషనల్ అయిపోయారు. అయితే... కొన్ని మీడియా సంస్థల రాతలు తన స్నేహితులపై ప్రభావం చూపించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక కారణం ఏమిటి? అంటే...

పాత కేసును తిరగతోడి... అమ్మాయి పేరు మార్చి!
యూట్యూబ్‌లో ప్రసాద్ బెహరా సిరీస్‌లు ఇన్‌స్టంట్ హిట్స్ అయ్యాయి. ఆయన నుంచి వచ్చిన ప్రతి సిరీస్ హిట్టే. విజయాలతో పాటు ఓ వివాదం కూడా ఆయన్ను చుట్టుముట్టింది. ప్రసాద్ బెహరాతో పాటు పని చేసిన ఆర్టిస్ట్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సన్ కంచన్ బమ్మే ఆయనపై కేసు పెట్టింది.

Also Read: Purple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?

ప్రసాద్ బెహరా తనను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కంచన్. ఆ విషయంలో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. కేసు నుంచి బయటపడి మళ్ళీ వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నారు ప్రసాద్ బెహరా. అయితే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ మళ్ళీ ఆ కేసును తిరగతోడింది. 'మగాడు కాదు... మృగాడు' పేరుతో ఓ వీడియో కథనాన్ని ప్రసారం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ప్రసాద్ బెహరా మీద కేసు పెట్టినది ఒక అమ్మాయి అయితే, ఆ కథనంలో చూపించిన ఫోటో మరొక అమ్మాయిది. ప్రస్తుతం ప్రసాద్ బెహరాతో కలిసి ఆయన రూపొందిస్తున్న యూట్యూబ్ సిరీస్‌లలో ఆమె కూడా నటిస్తున్నారు.

Also Read: Mrunal Thakur: మళ్ళీ బికినీలో మృణాల్... బాలీవుడ్‌లో అంతే అంతే!

ప్రముఖ ఛానల్ కథనం ప్రసారం అయ్యాక కంచన్ తర్వాత మరొక అమ్మాయిపై ప్రసాద్ బెహరా వేధింపులకు పాల్పడ్డాడా? అనే ప్రచారం మొదలైంది. ఛోటా మోటా యూట్యూబ్ ఛానల్స్, ప్రసాద్ బెహరా అంటే గిట్టని వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. వీడియో కథనంలో చూపించిన అమ్మాయి, ప్రసాద్ బెహరా మధ్య ఎటువంటి వివాదం లేదు సరికదా వాళ్ళిద్దరి మధ్య చక్కటి ప్రొఫెషనల్ బాండింగ్ ఉంది. దాంతో అటు వైపు అమ్మాయికి, ఇటు ప్రసాద్ బెహరాకు ఫోనులు మొదలు అయ్యాయి. దాంతో అసలు విషయం వివరించి, కొందరిని రిక్వెస్ట్ చేసి వీడియో డిలీట్ చేయించాల్సి వచ్చింది. అందుకని ప్రసాద్ బెహరా గట్టిగా ఎమోషనల్ అయ్యారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన తల్లిదండ్రుల పేర్లు సైతం మార్చారని ఆవేదన చెందారు. అదీ సంగతి. ప్రసాద్ బెహరా స్పీచ్ మధ్యలో లైవ్‌లో ఆయన వాయిస్ రాకుండా మ్యూట్ చేశారు. బహుశా... 'పాపం ప్రతాప్' సినిమా బదులు, ఈ స్పీచ్ వైరల్ అవుతుందనేమో!

Also Read: Vishnu Priya Bhimeneni: కేసుతో కలిసొచ్చిన పాపులారిటీ... సబ్‌స్క్రైబర్లు పెరిగారోచ్... విష్ణుప్రియకు డబ్బులే డబ్బులు