Pooja Hegde: 'టాక్సిక్'తో క్లాష్ వద్దు... రిలీజ్‌లో ముందుకొచ్చిన మృణాల్, పూజ సినిమా?
4 days ago 2
ARTICLE AD
బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగు సినిమా చేసి నాలుగేళ్లు అవుతోంది. అలాగని, సినిమాలు చేయకుండా ఖాళీగా లేరు. తమిళ్, హిందీలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న హిందీ సినిమాల్లో 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai) ఒకటి. ఆ సినిమా విడుదల ముందుకు జరిగిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే...
జూన్ 12న కాదు... మే 22న?
'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమాలో వరుణ్ ధావన్ హీరో. ఓ హీరోయిన్ పూజా హెగ్డే కాగా... మరొక హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తొలుత ఈ చిత్రాన్ని జూన్ 12, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం... మే 22న విడుదల చేస్తే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
Also Read: LIK First Day Collection: ఫస్ట్ డే ఫ్లాప్ టాక్... మరి కలెక్షన్స్? ప్రదీప్ రంగనాథన్ 'లైక్' ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
జూన్ రెండో వారంలో కంటే మే మూడో వారంలో థియేటర్లలో కాంపిటీషన్ తక్కువ ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. సినిమా నిర్మాణం దాదాపు పూర్తయింది కాబట్టి జూన్ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారట. మే ద్వితీయార్థంలో విడుదల చేస్తే... వేసవి సెలవులు ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, సినిమా విడుదలకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారట.
'టాక్సిక్'తో క్లాష్ కూడా తప్పుతుంది!
'టాక్సిక్' రిలీజ్ డేట్ జూన్ 4కు మారడంతో, ఆ సినిమాతో పోటీ వద్దనుకుని జూన్ 5న విడుదలకు సిద్ధమైన వరుణ్ ధావన్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఓ వారం వెనక్కి వెళ్ళింది. జూన్ 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. అయితే... వారం తర్వాత కూడా యష్ 'టాక్సిక్' హవా ఉండే అవకాశం ఉంది. పైగా జూన్ 12న మరో హిందీ సినిమా ఇంతియాజ్ అలీ రూపొందించిన 'మై వాపస్ ఆవుంగా' విడుదల అవుతోంది. దాంతో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకే మే నెలలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారట.
Also Read: Dacoit Review - డెకాయిట్ రివ్యూ: థ్రిల్లర్ తరహాలో సాగిన ప్రేమకథ... అడివి శేష్ సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుందా? సినిమా ఎలా ఉందంటే?
Read Entire Article