Polavaram MLA Attacked: ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే, మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరుకు చెందిన జనసేన నాయకుడు బొత్స మధు దాడికి ట్రై చేశారు.

దాడికి యత్నించిన మధును ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో పార్టీ ఆఫీస్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

అయితే, ఈ కార్యక్రమానికి వచ్చే ముందే జంగారెడ్డిగూడెం వేదికగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో కొందరి పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని, తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్రలు పన్నుతూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పోలవరంలో జనసేన మళ్లీ గెలవకపోతే తన పేరు మార్చుకుంటానంటూ ఆయన విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దాడి యత్నం ఘటనపై పోలీసులు, జనసేన అధిష్టానం ఆరా తీస్తున్నాయి.