<p><strong>Podharillu Serial Today Episode</strong>: మహాకు నైటీ నచ్చకపోవడంతో చక్రి మళ్లీ వెళ్లీ నైట్‌డ్రైస్ తీసుకుని వస్తాడు అది చూసిన కన్నా ఏంటది అని అడుగుతాడు. మీ వదిన కోసం గిప్ట్‌ తెచ్చానని చెప్పడంతో ఆమెకు ఎలా ఇస్తావో ఓ సారి ఇక్కడ ప్రాక్టీస్ చేద్దామని అంటాడు. కన్నా ముఖం చూసి చెప్పలేక కళ్లుమూసుకుని చక్రి ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. జీవితంలో తొలిసారి నీకోసం ఓ గిప్ట్ తెచ్చానని ఇది నువ్వు తప్పకుండా తీసుకోవాలని అంటుండగా...అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి తండ్రి నారాయణ....కొడుకు తనకోసం ఏదో తెచ్చాడని చాలా సంతోషపడతాడు. ఆనందంతో ఇంట్లోకి వెళ్లిపోయి స్నానం చేయడానికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లిన చక్రి మహా చదువుకుంటుండగా....ఇప్పుడు ఆమెను ఇబ్బందిపెట్టడం ఎందుకని తెచ్చిన కవర్‌పక్కన పెట్టి మాధవ్‌తో మాట్లాడుతుంటాడు. ఇంతలో స్నానం చేసి వచ్చిన ఆదినారాయణ...ఆ కవర్‌ తనకోసమే తెచ్చాడనుకుని తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతలో మహా బయటకు వచ్చి ఏంటని అడిగితే....నీకు ఓ గిప్ట్‌ తెచ్చానని తీసుకోవాలని చెబుతాడు. తీసుకురావడానికి వెళ్లగా...అక్కడ చక్రి తెచ్చిన నైట్‌ డ్రెస్‌ కవర్ కనిపించదు. దానికోసం వాళ్లంతా వెతుకుతుండగా....ఆదినారాయణ ఆ నైట్‌డ్రెస్‌ వేసుకుని బయటకు వస్తాడు. దాన్ని చూసి మహా పగలబడి నవ్వుతుంది. చక్రితోపాటు మాధవ్‌ కూడా ఆదినారాయణను తిడతారు. అసలు అది నీకు సూటవుతుందా లేదా అన్నది కూడా చూడకుండా వేసుకోవడమేనా అని మందలిస్తారు. కన్నకొడుకు తొలిసారి ప్రేమతో తెచ్చాడేమో అనుకున్నానని అంటాడు. వెంటనే తీసి ఇవ్వాలని అనగా...మహా వద్దులే అని వారిస్తుంది. ఆయన్నే వేసుకోమని చెబుతుంది. అది నాకు చాలా లూజు అవుతుందని మీరే ఉంచుకోండని అనగా...ఆదినారాయణ ఆనందంతో బయటకు వెళ్లిపోతాడు. మహా చక్రిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని అంటుంది. నాకోసం మీరు ఎలాంటివి కొని తీసుకురావొద్దని చెబుతుంది. ఇంతలో గాయత్రి అక్కడికి రాగా....చక్రి తాను మహా కోసం కొనుక్కుని వచ్చిన నైటీని ఆమెకు ఇచ్చి మాధవ్‌ అన్నయ్య నీకోసం ప్రేమతో కొని తెచ్చాడని చెప్పడంతో ఆమె దాన్ని తీసుకుని సంతోషంతో ఇంటికి పరుగెత్తుతుంది.<br /> మహాలక్ష్మీ పొద్దున్నే బయలుదేరి ఇంటర్వూ కోసం వెళ్తూ మాధవ్‌కు విషయం చెబుతుంది. ఇంటర్వూ విషయం తెలియని మాధవ్‌ ఎక్కడికమ్మా అని అడిగితే...అదేంటి మీరే కదా ఇంటర్వూ ఇప్పించారు. అని అంటుుంది. మీ రికమండేషన్‌ మీదే నాకు ఇంటర్వూ వచ్చిందని చెప్పగా...అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి అన్నయ్య మర్చిపోయి ఉంటాడులే అని చెబుతాడు. మహాను డ్రెస్‌ మార్చుకోమని చెప్పి పంపించి తానే ఇంటర్వూ ఏర్పాటు చేశానని....అది నువ్వు తెప్పించిన జాబ్‌ అంటే ఆమె చాలా సంతోషపడుతుందని అలా చెప్పానని అంటాడు. ఇలాంటి అబద్ధాలు ఇంకా ఎంతకాలం చెబుతావురా అని మాధవ్ తమ్ముడిని తిడతాడు. అందరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు చక్రి చెప్పిన అబద్ధాల గురించి మాధవ్‌ వాళ్ల తమ్ముళ్లకు చెబుతాడు. దీంతో వాళ్లంతా చక్రిపై మండిపడతారు. మా గురించి నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పాలిరా అని కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంతలో ఇంటర్వూకు పిలిచిన ఫ్రెండ్‌కు ఫోన్‌ చేయగా...అతను లిప్ట్ చేయకపోయేసరికి చక్రి చాలా టెన్షన్‌ పడతాడు. ఏదైతే అయ్యిందని మహాను తీసుకుని వాళ్ల కంపెనీ వద్దకు వెళ్తాడు. అక్కడ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ల ఫ్రెండ్‌ ఫోన్ లిప్ట్‌ చేయగా....ఏరా ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే ఏం రిప్లై ఇవ్వలేదేంటని అంటాడు. మా నాన్న ఊరి నుంచి సడెన్‌గా వచ్చేశాడని...ఇంటర్వూ చేయడం కుదరదని చెబుతాడు. ఇప్పుడు ఇలా చేస్తే ఎలారా అని చక్రి వాడిపై మండిపడతాడు. ఈ ఇంటర్వూ కోసం మహా చాలా ఎదురుచూస్తుందని అంటాడు.ఇప్పుడు నేనేం చేయలేనని చక్రివాళ్ల ఫ్రెండ్‌ చేతులెత్తేస్తాడు.</p>