Podarillu Serial Today Episode: భూషణ్‌ను రెండు తగిలించి మహాలక్ష్మీ సర్టిఫికేట్లు ఇప్పిస్తాడు చక్రి. మహాలక్ష్మీ నాదని....తనపై నువ్వు ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.మరోసారి తనవైపు కన్నెత్తి చూసినా చంపిపడేస్తానని అంటాడు. మహాలక్ష్మీ కూడా భూషణ్ చెంప పగులగొడుతుంది. మూడురోజులపాటు ఇంటర్వూ పేరిట నాటకాలాడి నన్ను మోసం చేస్తావా అని మండిపడుతుంది. ఇంకోసారి నా జోలికి వస్తే ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు పడతాయని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది. వచ్చిరాగానే చక్రిపై కోపంతో రగిలిపోతుంది. ఎందుకు అలా నన్ను చూస్తున్నారని చక్రి ప్రశ్నిస్తాడు.లోపల ఏం మాట్లాడారని అడుగుతుంది.నేను ఏం అన్నానని చక్రి అంటాడు. గుర్తుచేసుకోండని అనగా...మహాలక్ష్మీ నాది అనడం గుర్తుకు వస్తుంది. ఏదో ఫ్లోలో అలా అన్నానని అంటాడు. అయితే మాత్రం ఏదిపడితే అది మాట్లాడతావా అని అంటుంది. వాడిని గట్టిగా బెదిరిస్తే మీ జోలికి మళ్లీ రాడని అలా చెప్పానని అంటాడు.అయినా మాత్రం అంతకన్నా ఇంకా మంచి పదమే దొరకలేదా అని నిలదీస్తుంది. ఇంత గొడవలో కూడా ఈమె అది ఎలా గుర్తుపెట్టుకుందా అని చక్రి ఆలోచిస్తుంటాడు.

కారులో కూడా మహా ఏడుస్తుండటం చూసి చక్రి ఓదార్చుతాడు.లోకంలో వీడు ఒక్కడేనా ఉద్యోగం ఇచ్చేదని అంటాడు.ఒకటిపోతే వంద వస్తాయని అంటాడు.మీరు కేవలం ఉద్యోగం పోయినందుకు ఇంత బాధపడాల్సిన పనిలేదని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు.అసలు తప్పు అంతా నాదేనని...ఉద్యోగం రాకముందే స్వీట్లు పంచి సెలబ్రేషన్లు చేసుకున్నానని అంటుంది.ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పెద్దికి సమాధానం చెప్పాలని అంటుంది.ఇందులో మీ తప్పు ఏం ఉందని....ఆ వెధవ అక్కడ ఉంటాడని మీకు మాత్రం తెలియదు కదా అని అంటాడు.మీరు ఏం బాధపడకుండా ఉండండని అంటాడు.మా ఇంట్లో ఇలాంటి విషయాలు చాలా బాగా అర్థం చేసుకుంటారని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. మాధవ్‌ అడిగితే జరిగిన విషయం మొత్తం చెబుతాడు. ఇదంతా విన్న కేశవ్‌,కన్నా వాడి అంతు చూద్దామని అంటే....మాధవ్ ఇద్దరినీ గద్దిస్తాడు.మీ అన్నయ్య చక్రివాడికి బాగానే బుద్దిచెప్పాడని చెబుతుంది.

కేశవ్‌ మెకానిక్‌ షెడ్డు వద్దకు మళ్లీ వచ్చిన శైలూ...అతనికి సారీ చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ నీకు నిన్న ఇచ్చిన డోస్‌ సరిపోలేదా అని కేశవ్ మండిపడతాడు. మర్యాదగా నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. నీ గురించి నాకు బాగా తెలుసునని...సాయం చేసిన వాడినే తిట్టే రకమని అంటాడు.నీ సారీ,థ్యాంక్సు నాకు అవసరం లేదని అంటాడు. దీంతో మనమిద్దరం చేసిన రీల్‌ చాలా వైరల్‌ అయ్యిందని..కాబట్టి మనమిద్దరం కలిసి మరిన్ని రీల్స్‌చేస్తే చాలా ఫేమస్‌ అయిపోతామని అంటుంది. నీకు కూడా మంచి ఇమేజ్‌ వస్తుందని చెబుతుంది. నీతో చేయి కలిపి రీల్ చేసినందుకే మా ఇంట్లో నన్ను అందరూ ఆడేసుకుంటున్నారని...ఇప్పుడు ఏకంగా నీతో కలిసి రీల్‌ చేస్తే నన్ను బతకనివ్వరని అంటాడు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లకపోతే దెబ్బలు పడతాయని చెప్పి పంపిచేస్తాడు.

ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన ప్రతాప్ కారు సర్వీస్‌కు ఇస్తాడు.అది ఇంకా రాకపోవడంతో వాళ్ల ఫ్రెండ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ను పిలుస్తాడు. దీంతో వాళ్లను డ్రాప్‌ చేయడానికి చక్రి అక్కడికి వస్తాడు. అల్లుడిని చూసిన ప్రతాప్‌...వీడు రౌడీలా ఉన్నాడని వీడికారు ఎక్కనని అంటాడు. చక్రి నాకు చాలా బాగా తెలుసునని చాలా మంచి నమ్మకస్తుడని చెప్పి కారు ఎక్కిస్తాడు. కారు ఎక్కిన దగ్గర నుంచి మామ,అల్లుళ్లు మాటలతో యుద్ధం చేస్తుంటారు. మార్గమధ్యలో ఫ్రెండ్ దిగిపోవడంతో ప్రతాప్‌ ఒక్కడే కారులోఉంటాడు.అప్పుడు ఇద్దరూ ఏకంగా సవాల్‌ విసురుకుంటారు. నిజంగా మీ దగ్గర ప్రేమ ఉండి ఉంటే నీకూతురు ఎప్పుడో మీఇంటికి వచ్చేదని అంటాడు. నా దగ్గర ఆస్తి లేకపోయినా ప్రేమించే గుణం ఉంది కాబట్టే మహాలక్ష్మీ నాదగ్గర ఉందని అంటాడు. దీంతో ఉక్రోశం పట్టలేక ప్రతాప్‌ చక్రితో ఛాలెంజ్‌ చేస్తాడు.వారం రోజుల్లో మహాలక్ష్మీని నీ దగ్గర నుంచి మాఇంటికి తీసుకెళ్తానని అంటాడు. అప్పుడు నువ్వు మహాను శాశ్వతంగా వదిలేస్తున్నట్లు పేపర్‌పై సంతకం పెట్టాలని అంటాడు. ఈ విషయం మన ఇద్దరి మధ్యే ఉండాలని మహాకు తెలియకూడదని చెప్పడంతో చక్రి కూడా సరేనంటాడు.