PMMY Scheme: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా? ఉన్న దాన్ని డెవలప్ చేయాలనుకున్నా? లోన్ కంపల్సరీ. అయితే ఎలాంటి పూచీకత్తు లేకుండా లోన్ రావడం దాదాపు అసాధ్యం. చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం ఓ స్కీమ్ అమలు చేస్తుంది. అదే ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY). ఈ స్కీమ్ ద్వారా చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు లోన్ ఇస్తుంది. వడ్డీ రేట్లు బ్యాంకులు, NBFCల నిర్దేశించిన విధంగా ఉంటాయి. పీఎం ముద్ర యోజన లోన్ అర్హతలు, సబ్సిడీ, దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి ముద్ర యోజన

ఏప్రిల్ 8, 2015న ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు పూచీకత్తు లేకుండా రుణాలను అందించే స్కీమ్ ఇది. MUDRA అంటే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో, స్మాల్ ఇండస్ట్రీస్ కు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ స్కీమ్ కింద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (MFI) నుంచి లోన్లు పొందవచ్చు. ముద్రా యోజన సబ్సిడీ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు వర్తించదు.

PMMY లోన్ కేటగిరీలు

PMMY లోన్ పథకాలలోని నాలుగు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి.

1. శిశు లోన్ ( రూ.50 వేల వరకు) - ఈ కేటగిరిలో బిజినెస్ స్టార్టప్‌లు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులు, హోమ్ బేస్డ్ పారిశ్రామికవేత్తలు, సేవా కార్యక్రమాలకు రుణాలను అందిస్తుంది. వ్యాపారానికి కావాల్సిన సరుకులు, పరికరాలు, షాపు ఏర్పాటుకు కావాల్సిన ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

2. కిషోర్ లోన్ (రూ.50 వేలు నుండి రూ.5 లక్షల వరకు)- వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన నిధులు కోసం ఈ కేటగిరీ ద్వారా లోన్ మంజూరు చేస్తారు. మాన్యుఫాక్చరింగ్ వ్యాపారాలకు యంత్రాలు కొనుగోలు చేయడానికి, ఉద్యోగులను నియమించుకోవడానికి, మూలధనం లేదా వ్యాపార లావాదేవీలకు రుణాలు అందిస్తారు.

3. తరుణ్ లోన్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు)
స్థిరమైన వ్యాపార లావాదేవీలకు కోసం, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ కేటగిరీలో లోన్ ఇస్తారు. ఒక రుణాలను యంత్రాలు కొనుగోలు చేయడానికి, కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి, మార్కెట్లో కొత్త అవకాశాలు అన్వేషించడానికి, ఉత్పత్తిని చేపట్టడానికి ఈ రుణాలు ఉపయోగించుకోవచ్చు.

4. తరుణ్ ప్లస్ కేటగిరీ (రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు) - తమ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి అదనపు నిధులు కావాల్సి ఉంటుంది. ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ పథకం కింద అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అయితే, తరుణ్ కేటగిరీ కింద రుణాలు తీసుకుని, విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారాలకు మాత్రమే ఈ కేటగిరీ కింద లోన్ ఇస్తారు.

ముద్రా యోజన అర్హతలు

దరఖాస్తుదారుడు 18-65 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.

సింగిల్ యజమాని సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, పార్టనర్ షిప్ సంస్థ

బిజినెస్ ప్లానింగ్ ఉండాలి లేదా చిన్న వ్యాపారాన్ని నడుపుతూ ఉండాలి.

వర్తకం, తయారీ, సేవల రంగాలలో ఉండే వ్యవసాయేతర సంస్థ

లోన్ అవసరాలు రూ.20 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

అర్హత లేనివి

వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు

అవసరమైన పత్రాలు

శిశు కేటగిరి

గుర్తింపు రుజువు(ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు)

అడ్రస్ ఫ్రూఫ్ రుజువు (విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు)

ఇటీవలి రెండు ఫొటోలు

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనారిటీ వర్గానికి చెందిన రుజువు

బిజినెస్ చిరునామా

కొనుగోలు చేసే యంత్రాలు/పరికరాలు/ఇతర వస్తువుల కొటేషన్

బ్యాంకు స్టేట్‌మెంట్

Also Read:  50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం

కిశోర్, తరుణ్, తరుణ్‌ ప్లస్ అర్హతలు

గుర్తింపు రుజువు (ఓటరు ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డు/ఆధార్ కార్డు/పాస్‌పోర్ట్)

అడ్రస్ ఫ్రూఫ్ (విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఆస్తి పన్ను రసీదు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటరు కార్డు)

రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనారిటీ కుల ధృవీకరణ పత్రం

బ్యాంకు స్టేట్‌మెంట్

కొనుగోలు చేసే పరికరాలు కొటేషన్

వ్యాపార అడ్రస్ రుజువు(రెంటల్ అగ్రిమెంట్)

ఉద్యోగ్ ఆధార్ నమోదు

రెండేళ్ల బ్యాలెన్స్ షీట్లు

ఆర్థిక సంవత్సర అమ్మకాలు

ప్రోఫార్మా ఇన్వాయిస్‌లు/కొటేషన్లు

రుణగ్రహీత ఆస్తి, అప్పుల రిపోర్ట్

Also Read: సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?

ముద్రా లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

ముద్రా లోన్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్లై చేసుకోవచ్చు.

1. NBFCలు, బ్యాంకులలో ఆఫ్ లైన్ అప్లై ప్రాసెస్

ముద్రా లోన్ బ్యాంకుల జాబితాలోని ఏదైనా బ్యాంకు శాఖకు వెళ్లండి.

PMMY దరఖాస్తు ఫారమ్‌ను తీసుకుని మీ వివరాలు నమోదు చేయండి.

అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లికేషన్ కు యాడ్ చేయండి.

అప్లికేషన్ ఫారంను బ్యాంకులో సబ్మిట్ చేయండి.

మీ అప్లికేషన్ ఆమోదం పొందిన తర్వాత, లోన్ మొత్తం మీ అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తారు.

2. ముద్రా లోన్ ఆన్‌లైన్‌ ప్రాసెస్

మీ అవసరాలను బట్టి శిశు, కిషోర్, తరుణ్ లేదా తరుణ్‌ప్లస్ కేటగిరీలను సెలెక్ట్ చేసుకోండి.

ముద్రా యోజన రుణాలు ఇచ్చే బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వెబ్‌పేజీని క్లిక్ చేయండి.

లోన్ ఉద్దేశం, అవసరమైన మొత్తం తెలియజేస్తూ అప్లికేషన్ ఫారమ్ నింపండి.

ఐడెంటిటీ, అడ్రస్ ఫ్రూఫ్

బిజినెస్ రిజిస్టర్ ఫ్రూఫ్

గత ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లు

యంత్రాలు/పరికరాల కొటేషన్

బ్యాంకు అధికారులు మీ అప్లికేషన్, క్రెడిట్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తుంది.

లోన్ ఆమోదం పొందిన తర్వాత లోన్ మీ అకౌంట్ లో పడుతుంది.

డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ముద్రా కార్డు జారీ చేస్తారు.

Also Read:  మత్స్యకారులకు ఏపీ సర్కార్ మెగా గుడ్ న్యూస్ - మంగళవారమే ఖాతాల్లోకి రూ. 20 వేలు.. నేరుగా నగదు జమ!