న్యూఢిల్లీ: వాహనదారులకు వరుస షాకులు తగులుతున్నాయి. 5 రోజుల వ్యవధిలో రెండోసారి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మంగళవారం నాడు (మే 19న) పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఇంధన ధరలు పెరగడం వాహనదారులను ఇబ్బంది పెడుతోంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 నుంచి రూ. 98.64 కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ. 90.67 నుంచి రూ. 91.58 కి పెరిగింది. గత శుక్రవారం కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు దాదాపు రూ. 3 చొప్పున పెంచాయి.

కొత్త ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64, డీజిల్ లీటరుకు రూ. 91.58 కి చేరుకుంది.

ముంబైలో పెట్రోల్ రూ. 107.59, డీజిల్ లీటరుకు రూ. 94.08 అయింది.

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 109.70, డీజిల్ లీటరుకు రూ. 96.07 గా నమోదైంది.

చెన్నైలో పెట్రోల్ రూ. 104.49, డీజిల్ లీటరుకు రూ. 96.11 అయింది.

జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 108.84, డీజిల్ ధర లీటరుకు రూ. 94.12 కి చేరుకుంది.