Peddi Latest Schedule Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సానా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా 'పెద్ది'. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుందీ సినిమా. ఈ మూవీకి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని విడుదల తేదీకి మూడు నాలుగు నెలల ముందు షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారు రామ్ చరణ్.

ఢిల్లీకి రామ్ చరణ్ 'పెద్ది'
Peddi's Delhi schedule update: డిసెంబర్ 5 నుంచి ఢిల్లీలో 'పెద్ది' షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఐదు రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలు తీయనున్నారు. నిజానికి చాలా రోజుల క్రితం ఢిల్లీలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుమతులు రావడానికి సమయం పట్టింది. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఢిల్లీ షెడ్యూల్ కోసం రెడీ అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో మరికొంత షూటింగ్ చేయనున్నారు.

జనవరిలో షూటింగ్ ఫినిష్!
జనవరికి 'పెద్ది' షూటింగ్ మొత్తం ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారట. సంక్రాంతికి ముందు లేదా సంక్రాంతి తర్వాత గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేశారని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ముందు, విడుదల తేదీ కంటే మూడు నెలల ముందు ప్రాజెక్టు షూట్ అంతా కంప్లీట్ చేస్తానని చెప్పారట.

Also Read: స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్... అదీ ప్రభాస్ - వంగా కాంబో డిమాండ్

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న 'పెద్ది' సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'పెద్ది' టీజర్, ముఖ్యంగా 'చికిరి' సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Also Read: Pilla Song - Dhandoraa: లవర్ బాయ్‌గా రవికృష్ణ... మనికా చిక్కాలతో స్టెప్పులు... 'దండోరా'లో 'పిల్లా...' సాంగ్ చూశారా?