Peddi Review - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
2 days ago 2
ARTICLE AD
Peddi Movie Review In Telugu: రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఇతర ప్రధాన తారాగణం. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.
కథ (Peddi Movie Story Explained In Telugu): విజయనగరం కొండ కింద ఊరికి చెందిన వ్యక్తి పెద్ది (రామ్ చరణ్). అ ఊరికి పేరు లేదు. ఊరిలో ప్రజలకు గుర్తింపు లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరు లేదు. ఆ ఊరి ప్రజలకు గుర్తింపు ఉండరు. విజయనగరం నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే కొండలు వాగులు దాటుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నడవాలి. తమ ఊరికి గుర్తింపు తీసుకు రావాలని, రైల్వే స్టేషన్ కావాలని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అప్పలసూరి (జగపతి బాబు) తిరుగుతూ ఉంటాడు. ఇవేవీ పెద్దికి పట్టవు.
ఆట కూలీగా... విజయనగరం లేదా బొబ్బిలి - తనను  ఏ ఊరి ప్రజలు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే ఆ ఊరి తరఫున క్రికెట్ ఆడతాడు. విజయనగరం రామ్ బుజ్జి (దివ్యేందు శర్మ)తో జరిగిన గొడవ కారణంగా పెద్దికి అవమానం జరుగుతుంది. అప్పలసూరి మరణం పెద్ది ఆలోచనను మారుస్తుంది.
క్రికెట్ నుంచి గౌర్ నాయుడు (శివ రాజ్ కుమార్) శిక్షణలో కుస్తీ నేర్చుకుంటాడు. జాతీయ పోటీలకు వెళ్లి విజయం సాధించి తమ ఊరికి గుర్తింపు తీసుకు రావాలని అనుకుంటాడు. అయితే అక్కడ పెద్దికి ఉన్న ఎదురైన అడ్డంకులు ఏమిటి? కుస్తీ నుంచి రన్నింగ్ వైపు ఎందుకు వచ్చాడు? చివరకు తమ ఊరికి గుర్తింపు, రైల్వే స్టేషన్ ఎలా తీసుకు వచ్చాడు? అనేది కథ. మధ్యలో అచ్చియమ్మ (జాన్వీ కపూర్)తో ప్రేమ కథ ఏమిటనేది సినిమాలో చూడాలి.
Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
విశ్లేషణ (Peddi Movie Review Telugu): రామ్ చరణ్ కమర్షియల్ కథానాయకుడు. కథ నచ్చితే తన మాస్ ఇమేజ్ పక్కన పెట్టడానికి అసలు ఏమాత్రం సందేహించరు. తనలోని నటుడిని బయటికు తీసుకు వచ్చే క్యారెక్టర్ వస్తే సినిమా చేస్తారు. అందుకు ఉదాహరణ... రంగస్థలం. గేమ్ ఛేంజర్ కమర్షియల్ పరంగా ఫ్లాప్ అయినా అందులో అప్పన్న పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. ఈ పెద్ది సినిమా చూశాక... క్యారెక్టర్ నచ్చి, తనలో నటుడిని మరోసారి బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉండటంతో చేశారని అనిపిస్తుంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా కథలో కమర్షియల్ హంగులు లేవని కాదు... ఉన్నాయి. అయితే... ఆయన వాటిని నమ్ముకోలేదు. క్లైమాక్స్ ఎపిసోడ్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దానికి ముందు మెగా ఫాన్స్, ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలతో కథను నడిపించారు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ ముందు వరకు ఫక్తు మాస్ మసాలా, కమర్షియల్ పంథాలో సినిమా సాగుతుంది. ఊరి నేపథ్యం, వాళ్ల పరిస్థితి వివరించడానికి కొంత సమయం తీసుకున్నారు. అయితే... ఒక్కసారి రామ్ చరణ్ పాత్ర పరిచయమైన తర్వాత సీన్, సాంగ్, ఫైట్ అంటూ బ్యాక్ టు బ్యాక్ మాస్ మెచ్చే అంశాలతో సినిమాను ముందుకు తీసుకు వెళ్లారు. రొటీన్ టెంప్లేట్ లో సినిమా తీశారు.
ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎమోషనల్ హై ఇస్తుంది. అప్పటి వరకు సరదాగా వెళుతున్న సినిమాలో అదొక జర్క్. అక్కడ హీరోకి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఆ తర్వాత కూడా కమర్షియల్ పంథాలో సినిమా సాగింది. స్లో అండ్ స్టడీగా ముందుకు వెళుతున్న సినిమాలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మరో ఎమోషనల్ హై ఇచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తాగాలో తెలిసినోడు గొప్పోడు... అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఇది. ఎమోషనల్ సీన్స్ హై ఇవ్వడం కోసం అన్నట్టు బుచ్చిబాబు రచన మధ్యలో కాస్త కిందకు దిగింది. స్క్రీన్ ప్లే సరిగా లేదు. స్టోరీకి అవసరమైన హై ఇవ్వలేదు. ప్రేక్షకులను నెక్స్ట్ ఏంటి అని ఎగ్జైట్ అయ్యేలా చేయలేదు.
బుచ్చిబాబు కథలో కమర్షియల్ అంశాలతో పాటు మంచి కంటెంట్ కూడా ఉంది. అయితే... స్క్రీన్ మీదకు ఆ కంటెంట్ తీసుకు వచ్చే క్రమంలో కొంత హడావిడి కనిపించింది. క్రికెట్ నుంచి కుస్తీ, కుస్తీ నుంచి రన్నింగ్, హీరోకి లక్ష్యం ఏర్పడటం వంటివి సన్నివేశాలు హడావుడిగా ముగిసినట్టు అనిపించింది. ట్రాన్సిషన్ సరిగా కుదరలేదు. రామ్ చరణ్ క్యారెక్టర్, నటన మీద ఎక్కువ దృష్టి పెట్టిన దర్శకుడు... మిగతా నటీనటుల క్యారెక్టర్లను, వాళ్ళ సన్నివేశాలను సరిగా రాసుకోలేదు. జగపతి బాబు రోల్, ఆయన సీన్స్ సూపర్బ్. అయితే దివ్యేందు శర్మ, రవి కిషన్, బోమన్ ఇరానీ వంటి ఆర్టిస్టులకు సరైన రోల్స్ పడలేదు. సినిమాలో బలమైన విలన్ ట్రాక్ లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక్కో పాత్రలో విలనిజం బయట పడుతుంది. అంతే గానీ ఈ సినిమాకి విలన్ ఎవరూ లేరు. సినిమా మెయిన్ పాయింట్ హీరోయిజం కాదు... తమ ఊరికి గుర్తింపు తీసుకు రావడం. అందుకు తగ్గట్టు హీరో ప్రయాణం సాగుతుంది. అందువల్ల, ప్రేక్షకులు ఆశించే హై, భారీ యాక్షన్ సన్నివేశాలు లేవు. అవి ఆశిస్తే బాగా డిజప్పాయింట్ అవుతారు.
టెక్నికల్ పరంగా ఏఆర్ రెహమాన్ సంగీతం ఉన్నత స్థాయిలో ఉంది. ఆల్రెడీ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆ పాటలకు రామ్ చరణ్ డాన్స్ ఇంకా బావుంది. అయితే నేపథ్య సంగీతంలో రెహమాన్ ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు. కొన్ని సన్నివేశాల్లో బావుంటే మరికొన్ని సన్నివేశాల్లో బాలేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ పరంగా డిజప్పాయింట్ చేసిందీ సినిమా. సీన్ టూ సీన్ ట్రాన్సిషన్స్ స్మూత్ గా లేవు. ఉన్నట్టుండి కొన్ని సీన్స్ ఎండ్ అవుతాయి. మరో సీన్ వస్తుంది. వృద్ధి సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
పెద్ది పాత్ర కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టేశారు. ఆయన కష్టం తెరపై కనిపిస్తుంది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కటే కాదు... నటనలోనూ బెస్ట్ ఇచ్చారు. సినిమా సినిమాకూ రామ్ చరణ్ రాటు దేలుతున్నారు. క్రికెట్ ఆడేటప్పుడు స్వాగ్ చూపించిన ఆయన... కుస్తీకి వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ మార్చారు. పరుగు పందెంలో కంటతడి పెట్టించారు. తన భుజాలపై సినిమాను మోశారు.
రామ్ చరణ్ తర్వాత ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండే పాత్ర జగపతి బాబుది. ప్రేక్షకులు ఆయనలో కొత్త నటుడిని చూస్తారు. శివరాజ్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. జాన్వీ కపూర్ నటన కంటే అందాల ఆరబోత హైలైట్ అవుతుంది. అందాల ప్రదర్శనకు, ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు కథను నడిపించడం కోసం తప్ప ఆమె పాత్ర వల్ల సినిమాకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథను సరిగా రాయలేదు.
మాస్ జనాలను జాన్వీ కపూర్ గ్లామర్ ఆకట్టుకోవచ్చు. దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్, రవి కిషన్... సినిమాలో పేరున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. తెరపై ఇలా వచ్చి అలా వెళతారు.
Peddi Verdict: కమర్షియల్ అంశాలతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమా పెద్ది. అయితే... కమర్షియాలిటీ కంటే కంటెంట్ హైలైట్ అవుతుంది. కథలో ఎమోషనల్ సీన్స్ హై ఇస్తాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు, అలాగే లాస్ట్ 30 మినిట్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. రామ్ చరణ్ తన నటనతో సినిమాను నిలబెట్టారు. పెద్ది... నటుడిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఆయన కోసం సినిమా చూడాలంతే.
Read Entire Article