Madras High Court Grants Anti Piracy Injunction For Ram Charan Peddi Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేలా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

యాంటీ పైరసీ ఇంజంక్షన్

పెద్ది కాపీ రైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మూవీని ఆన్ లైన్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అన్ అఫీషియల్‌గా సినిమా ఇంటర్నెట్‌లో లీకైతే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడుతూ... యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసింది.

Also Read : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...