Director Buchibabu About Ram Charan's Peddi Climax : ఫస్ట్ మూవీ 'ఉప్పెన'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ బుచ్చిబాబు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా తనదైన మార్క్‌తో సాధారణ లవ్ స్టోరీలానే అనిపించినా... ఎవరూ ఊహించని క్లైమాక్స్‌తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా పెద్దితో రాబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.

ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుండగా... చరణ్ రోల్, పెద్ది స్టోరీ, క్లైమాక్స్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

షాకింగ్ ఎలిమెంట్

ఉప్పెన క్లైమాక్స్‌లానే పెద్దిలోనూ షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటుందని చెప్పారు బుచ్చిబాబు. 'ఓ స్ట్రాంగ్ పాయింట్‌తో మూవీ తీస్తే క్యూరియాసిటీ ఆటోమేటిక్‌గా ఉంటుంది. నార్మల్ క్లైమాక్స్ ఉంటే ఎవరు డిస్కషన్ పెట్టరు. డిఫరెంట్ క్లైమాక్స్ ఉంటేనే చాలా కాలం గుర్తుంటుంది. ఈ మూవీలో ఉప్పెనలానే షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఎలా డిజైన్ జరిగిందని అంతా ఆశ్చర్యపోతారు.

సుకుమార్ సార్ అన్నట్లు రంగస్థలంను మించేలా ఉంటే చాలా హ్యాపీ. లాస్ట్ 45 మినిట్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. హృదయానికి హత్తుకుంటుంది. పెద్ది మిమ్మల్ని నవ్విస్తాడు, డ్యాన్స్ చేయిస్తాడు, ఎమోషనల్‌గా ఉంటాడు, ఏడిపిస్తాడు. మీ హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు పెద్ది.' అని చెప్పారు. దీంతో ఉప్పెనలాంటి ఎవరూ ఊహించని క్లైమాక్సే ఈ సినిమాలోనూ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?