Bandla Ganesh Counter To Prakash Raj : నటుడు ప్రకాష్ రాజ్‌కు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడంపై ప్రకాష్ రాజ్ పరోక్షంగా పోస్ట్ చేయగా దీనికి తనదైన శైలిలో గట్టిగా ఆన్సర్ ఇచ్చారు గణేష్.

'రండి దొర రండి'

'రండి దొర రండి... కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి. మీరొస్తానంటే మేమొద్దంటామా?' అంటూ పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్.

దీనికి బండ్ల గణేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతీ దాంట్లో జోక్యం చేసుకునేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. 'నీకెందుకురా ప్రతీ దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా? తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది? నీ కథ ఏంటి? ప్రతీ ఊర్లో, ప్రతీ ఇష్యూలో దూరి జడ్జిమెంట్స్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా దేశ ప్రధానివా?

ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్.' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కొందరు బండ్ల గణేష్‌కు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని… https://t.co/ELkBZtEUh8

— BANDLA GANESH. (@ganeshbandla) June 4, 2026

Also Read : Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్