Pastor Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District)చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఒక వార్త సంచలనంగా మారింది. పాస్టర్ అభినయ్ దర్శన్‌(Pastor Abhinay Darshan)పై గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు దాడి చేశారని ఆయనను చంపేందుకు యత్నించారనే ప్రసారం జోరుగా సాగింది. ఒక మతబోధకుడిపై ఇలాంటి దాడి జరగడం వెనుక ఉన్న కారణాలు ఏంటనే ఆందోళన వ్యక్తమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.

పాస్టర్ అభినయ్‌ దర్శన్‌పై దాడి అంటూ ప్రచారం

పాస్టర్ అభినయ్‌ దర్శన్ కథనం ప్రకారం ఆయన చింతపల్లి(Chintapalli Police) పరిసరాల్లో కారులో ప్రయాణిస్తుండగా కొంతమంది వ్యక్తులు విరుచుకుపడ్డారు. కారు అద్దాలు పగులగొట్ట తనను చంపేందుకు తీవ్రంగా యత్నించారు. అయితే తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని ఆయన హంగామా చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన కేసు కావడంతో, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ స్వయంగా రంగగంలోకి దిగి పర్యవేక్షించారు.

సోషల్ మీడియా విప్పిన గుట్టు

కేసును లోతుగా విశ్లేషించిన పోలీసులకు ప్రారంభం నుంచే కొన్ని అనుమానాలు కలిగాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అభినయ్ దర్శన చెబుతున్న మాటలకు పొంతన కుదరలేదు. ఎస్పీ అమిత్‌ బర్దర్‌(SP Amit Bardar) పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాయి. ఈ క్రమంలోనే అభినయ్‌ దర్శన్ ఉపయోగించిన సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పోలీసులు కుణ్ణంగా పరిశీలించారు.

పక్కా ప్లాన్ ప్రకారం చేపట్టిన దాడి డ్రామాగా తేల్చిన పోలీసులు

అక్కడ దొరికిన ఆధారాలు పోలీసులను విస్మయానికి గురి చేశాయి. ఈ హత్యాయత్నం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు నాటకమని (Fake Assassination Attempt)చాట్ హిస్టరీ, ఆడియో సందేశాలు స్పష్టం చేశాయి. దాడి జరిగినట్టు నమ్మించేందుకు ముందుగానే ఎవరికీ ఏ బాధ్యతలు అప్పగించారో నిర్ణయించుకున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి.

ఆరుగురు పాల్గొన్నట్టు తేల్చిన పోలీసులు

పోలీసుల విచారణలో తేలిన కీల విషయం ఏంటంటే, ఈ దాడి అసలు జరగనే లేదు. కేవలం సానుభూతి పొందడం కోసం లేదా ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం అభినయ్ దర్శన్ ఈ పథకాన్ని రచించారు. ఈ నాటకంలో ఆయన ఒంటరివాడు కాదు, అభినయ్‌కు సహకరించిన మరో ఆరుగురు వ్యక్తులు కూడా ఈ కుట్రలో భాగమయ్యారని పోలీసులు గుర్తించారు.

పేక్ అటాక్ అని తేల్‌చిన పోలీసులు

అభినయ్‌ దర్శన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా(Instagram Evidence)లోని వీడియో చాట్స్‌ , ఆడియోలు ఈ ప్లాన్‌ను ముందే సిద్ధం చేసినట్టు నిరూపించాయి. గాయాలైనట్టు అభినయ్ చేసిన ప్రకటనను వైద్యులు నివేదికలు తప్పుబట్టాయి. ఆ నివేదికలను పరిశీలించిన పోలీసులు ఇది ఫేక్ ఎటాక్ అని నిర్దారించారు.

మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసేలా, పోలీసు యంత్రాంగాన్ని తప్పుదారి పట్టించేలా ప్రవర్తించిన అభినయ్ దర్శన్‌తోపాటు ఆయనకు సహకరించిన ఆరుగురిపై పోలీసుల కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.