Pastor Abhinay Darshan Dark Side: తనపై తాను దాడి చేయించుకుని హాట్ టాపిక్‌గా మారిన పాస్టర్ అభినయ్ దర్శన్ పాతకథలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలు, మూడు పెళ్లిళ్లు, భార్యకు వేధింపులు సలా ఆయన చరిత్ర చాలా ఉంది.

హిందూ, క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన అభినయ్ దర్శన్ గత చరిత్రను తవ్వి తీస్తుంటే బయటపడుతున్న నిజాలు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆధ్యాత్మిక వేదికలపై ఆయన ఇచ్చే ప్రసంగాలకు, తెరవెనుక ఆయన నడిపే వ్యవహారాలకు అస్సలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అభినయ్ దర్శన్ కేవలం ఒక మతబోధకుడు మాత్రమే కాదు, ఆయన గతంలో సినిమా రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అభినయ్ అనే పేరుతో సినిమాల్లో నటించి, వెండితెరపై మెరవాలని కలలు కన్నారు. మాయాజాలం అనే సినిమా తీశారు. ఆ సినిమా ఏమయిందో ఎవరికీ తెలియదు. అయితే అక్కడ ఆశించిన గుర్తింపు రాకపోవడంతో, తర్వాతి కాలంలో దర్శన్ గా మారి ఆధ్యాత్మిక బాట పట్టారు. సినిమాల్లో పండని గ్లామర్, రాజకీయ వేదికలపై దొరకని మైలేజీని ఈ డివైన్ వేదికల ద్వారా సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రసంగాల్లో ఉండే నాటకీయత, హావభావాలు అన్నీ సినిమా రంగానికి సంబంధించినవేనని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. తర్వాత అదే పద్దతిలో రాజకీయంపై కన్నేశారు.

ఈ పాస్టర్ మామూలోడు కాదు అని చెప్పడానికి ఆయన మూడు పెళ్లిళ్ల వ్యవహారమే నిదర్శనం. క్రైస్తవ గురువుగా ఉంటూ క్రమశిక్షణ గురించి బోధించే అభినయ్, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస వివాదాలతో సావాసం చేస్తున్నారు. మొదటి భార్య ఉండగానే మరో వివాహం చేసుకోవడం, ఆపై ఆమెతోనూ గొడవలు పడి మూడో పెళ్లి కూడా చేసుకుననారు. దేవుడు క్షమిస్తాడు అనే సాకుతో తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ, మహిళలను మోసం చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Remember this pastor ‘Abhinay Darshan’? He treats himself as a superior being and turns his followers into slaves. He is on a ‘padayatra’ and begging his converted sheep to cover his daily expenses of 7000–10000 on top of the donations. 🤷🏻‍♂️🤦🏻‍♂️

His begging style is a bit different.… pic.twitter.com/0ZOUogMx1g

— Tathvam-asi (@tathvamasi6) March 22, 2026

కేవలం వ్యక్తిగత వివాదాలే కాదు, అభినయ్ దర్శన్ చుట్టూ అనేక పాత కేసులు , ఆర్థిక ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రార్థన మందిరాల నిర్మాణం పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ సొమ్ముతో అత్యంత ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

పోలీసులు ఇప్పుడు అభినయ్ దర్శన్ గురించి మొత్తం వెలుగులోకి తెస్తున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఇప్పుడు దాడి నాటకం ఆడారు.. తెర వెనుక ఎవరున్నారన్నది మొత్తం తేల్చనున్నారు.