నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise Movie). 'దసరా' విజయం తర్వాత మరోసారి నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన చిత్రమిది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. పాటలతో తోడు నాని జడల్ లుక్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. నాని కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా సినిమా వెళుతుంది. మరి, సినిమా ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి.

సవారీగా అదరగొట్టిన నాని
'ది ప్యారడైజ్' కోసం ఓ ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అందులో సవారీ అనే తెగ ఉంటుంది. వాళ్ళకు ఎటువంటి గుర్తింపు ఉండదు. ఆ సవారీలు (పురుషులు) జడలు వేసుకుని ఉంటారు. సవారీల్లో ఎవరినైనా చంపేస్తే కేసులు కూడా ఉండవు. ఎందుకంటే... జనాభా లెక్కల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఏ విధమైన ప్రభుత్వ రికార్డుల్లో ఉండరు. అటువంటి ఓ సవారీ పాత్రను నాని ఈ సినిమాలో పోషించారు. తమ కమ్యూనిటీ గుర్తింపు కోసం పోరాడిన యోధుడిగా 'జడల్' పాత్రలో నాని అదరగొట్టారని తెలిసింది. నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చూడొచ్చని చెబుతున్నారు.

మదర్ సెంటిమెంట్ కీలకం!
ఇప్పటి వరకు 'ది ప్యారడైజ్' నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. కానీ, ఇందులో యాక్షన్ కంటే ఎక్కువ మదర్ సెంటిమెంట్ ఉంది. ఆ యాక్షన్ డ్రైవ్ వెనుక కీలకమైనది తల్లి క్యారెక్టర్. హీరో నాని తల్లి పాత్రలో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి నటించారు. ఇంటర్వెల్ ముందు సోనాలి, నాని మధ్య సన్నివేశాలు అందరి చేత క్లాప్స్ కొట్టించేలా వచ్చాయని తెలిసింది.

Also Read: Nani The Paradise Opening Collection - నాని కెరీర్‌లో ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ దిశగా 'ది ప్యారడైజ్'... ఫస్ట్ డే ఎన్ని కోట్లు రావచ్చంటే?

ఇంటర్వెల్ బ్లాక్, సినిమా చివరి 40 నిమిషాలు అదిరిందట. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టేకింగ్ సర్‌ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమా విడుదలకు ముందు హిట్ అయ్యింది. పాటల కంటే నేపథ్య సంగీతంలో అనిరుధ్ మార్క్ ఎక్కువ కనిపించిందని టాక్.

మోహన్ బాబు విలనిజం సూపర్...
ఎన్టీఆర్, కేసీఆర్ క్యారెక్టర్లు కూడా!
'ది ప్యారడైజ్' నిడివి 2:45 గంటలు. ఈ నిడివిలో శ్రీకాంత్ ఓదెల చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చారట. ముఖ్యంగా ఈ కథ 1985 సమయంలో జరుగుతుంది. అప్పటి కాలాన్ని తెరపై ఆవిష్కరించడం కోసం రాజకీయ నాయకులను సైతం చూపించారు. వారిలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన పాత్రను 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నటించిన పి విజయ్ కుమార్ చేశారు. కేసీఆర్ పాత్రను ప్రియదర్శి చేసినట్టు తెలిసింది. అయితే ఆ రెండు పాత్రల నిడివి చాలా తక్కువ అని, తెరపై కనిపించేది కాసేపు మాత్రమే అని టాక్.

Also Read: The Paradise Collection Records - రామ్ చరణ్ 'పెద్ది', చిరు - పవన్ రికార్డులు బీట్ చేసిన 'ది ప్యారడైజ్' - అమెరికాలో జడల్ జమానా షురూ

విలన్ షికంజా మాలిక్ పాత్రలో లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన అందరికీ షాక్ ఇస్తుందట. మరోసారి విలనిజం ఇరగదీశారట. బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ కూడా కుమ్మేశారట. హీరోయిన్ కయాదు లోహర్ రోల్ సర్‌ప్రైజ్‌తో పాటు షాక్ ఇస్తుందట.

Also Read: Nani The Paradise Advance Booking - అమెరికాలో నాని 'ప్యారడైజ్' రికార్డుల వేట... ఇండియాలో ఫస్ట్ డే అడ్వాన్స్ సేల్స్ ఎంతంటే?