ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ (Palash Muchhal)పై కుల వివక్ష (Caste Abuse) కేసు నమోదు అయ్యింది. అంతే కాదు... మోసం కూడా చేశారని మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే...

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి విజ్ఞాన్ మానే తెలుసుగా! గతంలోనూ పలాష్ ముచ్చల్ మీద ఆరోపణలు చేశారు. సినిమా చేసే పేరుతో తన దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని తెలిపారు. ఇప్పుడు ఆ కేసులో మరొక అడుగు ముందుకు వేశారు.

Also Read: SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

'నజరియా' చిత్ర నిర్మాణం కోసం పలాష్ ముచ్చల్ తన దగ్గర నుంచి పాతిక లక్షల రూపాయలు తీసుకున్నారని విజ్ఞాన్ మానే గతంలో ఆరోపించారు. అంతే కాకుండా ఆ సినిమాలో తనకు ఒక పాత్ర ఇస్తానని కూడా చెప్పారని, సినిమా విడుదల అయ్యాక లాభాల్లో వాటా ఇస్తానని పలాష్ హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే... ఆ సినిమా చేయలేదు. విజ్ఞాన్ మానే దగ్గర తీసుకున్న డబ్బును పలాష్ ముచ్చల్ తిరిగి ఇవ్వలేదు. ఇవ్వడానికి నిరాకరించారు. డబ్బుల గురించి గట్టిగా అడగటంతో కులం పేరుతో దూషించారని తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

సాంగ్లీలోని ఒక ఫామ్‌హౌస్‌లో గత ఏడాది నవంబర్ 22న తన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు... తనను కులం పేరుతో పలాష్ ముచ్చల్ దూషించారని, చాలా అవమానకరంగా & అమర్యాదగా ప్రవర్తించారని, దూషించే క్రమంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని విజ్ఞాన్ మానే ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో సాంగ్లీ పోలీసులు పలాష్ ముచ్చల్‌ మీద అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యాక ఈ కేసు వెలుగులోకి రావడం గమనార్హం.

Also Read: Prasad Behara: మీవి కన్నీళ్లు... నావి *చ్ఛ కాదు - పాపం ప్రసాద్ బెహరా, ఎమోషనల్ స్పీచ్ వెనుక కారణం ఏమిటంటే?