Oscar Awards 2026 Winning Movies OTT Streaming : ఆస్కార్ 2026 వేడుకల్లో ఒకే మూవీ సిక్సర్ కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, సహాయ నటుడు, ఉత్తమ కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారం వరించింది. ఆ తర్వాత నాలుగు పురస్కారాలతో 'సిన్నర్స్' మూవీ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు అందుకుంది సిన్నర్స్.

ఆస్కార్ సిక్సర్... వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఓ బిడ్డ కోసం తండ్రి చేసిన పోరాటం, తల్లి మీద కోపం, తండ్రి మీద అనుమానంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న కొడుకు ఏం చేశాడు? తన కొడుకు నమ్మకాని గెలుచుకునేందుకు తండ్రి ఏం చేశాడు? విప్లవం, పగ, స్వార్థం, అవమానం, అనుమానం, ప్రేమ, నమ్మకం, మానవ సంబంధాలు, నైతిక విలువలు ఇలా అన్ని కలగలిసిన ఓ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీని రూపొందించారు.

బిడ్డ నమ్మకాన్ని గెలుచుకునేందుకు ఓ తండ్రి పడే తనను హార్ట్ టచింగ్‌గా చూపించారు డైరెక్టర్ పాల్ థామస్ అండర్సన్. ఈ మూవీలో లియోనార్డో డికాప్రియో, టియానా టేలర్ ప్రధాన పాత్రలు పోషించారు. 2000 నాటి వైన్ లాండ్ నోవల్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. మొత్తం 13 విభాగాల్లో నామినేషన్లలో నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ సహా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Also Read : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్