Pawan Kalyan's OG Movie Trailer Out Now: అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్... మరోవైపు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అవెయిటెడ్ 'OG' ట్రైలర్ వచ్చేసింది. పవర్ స్టార్ గ్రేస్‌కు పదింతలు హైప్ ఇచ్చేలా ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది.

పవర్ స్టార్ పవర్... గూస్ బంప్స్ పక్కా

'ఓజాస్ గంభీర' అంటూ ఫైర్ స్ట్రోమ్ సాంగ్‌తోనే 'OG'లో పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్‌ను ఎలివేట్ చేశారు డైరెక్టర్ సుజీత్. ఇప్పుడు ట్రైలర్ దాన్ని మరింత పెంచుతూ భారీ హైప్ క్రియేట్ చేశారు. గ్యాంగ్ స్టర్‌గా పవన్ గ్రాండియర్ లుక్ అదిరిపోయింది. పవర్ ఫుల్ వెపన్స్‌తో ఆయన తన గ్యాంగ్‌తో చేసిన వార్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, బీజీఎంలు, లుక్స్ వేరే లెవల్‌లో ఉండగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అంతకు మించి అనేలా ఉంది. మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇక సత్య దాదాగా ప్రకాష్ రాజ్, గీతగా శ్రియా రెడ్డి, అర్జున్‌గా అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మించారు. ఈ నెల 25న పాన్ వరల్డ్ స్థాయిలో 'OG' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: మోహన్ లాల్ @ 'ది కంప్లీట్ యాక్టర్' - మలయాళం To తెలుగు... యాక్టర్ నుంచి సింగర్ వరకు ఈ విషయాలు తెలుసా?