Pawan Kalyan Grace In OG Pre Release Event: పవర్ స్టార్ నిజంగా పవర్ స్టారే. అవును 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ వర్షంలోనూ బిగ్ సక్సెస్ కావడం వెనుక ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే ఉన్నారు. భారీ వర్షం పడుతున్నా వేలాది మంది అభిమానులు ఉన్న చోట నుంచి కదలలేదు అంటే కారణం పవన్ కల్యాణ్. గతంలో కంటే భిన్నంగా ఈవెంట్‌కు ఆయన ఎంట్రీ దగ్గర నుంచీ స్పీచ్, శివమణి డ్రమ్స్ మ్యూజిక్‌కు స్టెప్పులేయడం వరకూ అందరినీ సర్ ప్రైజ్ చేశాయి.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆదివారం 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీం భారీగా ప్లాన్ చేసింది. అయితే, ముందు వర్షం పడే సూచనలు కనిపించినా ఆ తర్వాత అంతా రాదనే అనుకున్నారు. కానీ ఈవెంట్ సరిగ్గా స్టార్ట్ అయ్యే సమయానికి భారీ వర్షం ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో అంతా ఆందోళనకు గురయ్యారు.

కత్తితో మాస్ ఎంట్రీ

ఇదే టైంలో ఈవెంట్‌లోకి 'OG' గ్రేస్‌కు తగ్గట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను చూసిన ఫ్యాన్స్ ఉత్సాహంగా కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఫ్యాన్స్ సందడితో స్టేడియం దద్దరిల్లిపోయింది. చుట్టూ కత్తి చూపిస్తూనే తన స్పీచ్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్‌లో 'వాషి యో వాషి' అంటూ జపనీస్ హైకూను ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్యాన్స్‌ను ఉద్దేసించి అదిరిపోయే కామెంట్స్ చేశారు.

స్పీచ్ హైలైట్స్

'ఎప్పుడో 'ఖుషీ' మూవీ టైంలో ఇంత జోష్ చూశానని... మళ్లీ ఇప్పుడే చూస్తున్నట్లు పవన్ చెప్పారు. 'ఓజీ సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. నేను పాలిటిక్స్‌లోకి వెళ్లినా నన్ను మీరు వదల్లేదు. పాలిటిక్స్‌లో ఉంటూ మూవీస్ చేస్తున్నానంటే దానికి మీరే కారణం. ఈ వర్షం కానీ ఏవీ మనల్ని ఆపలేవు.' అంటూ గొడుగులతో ఉన్న సెక్యూరిటీని కూడా ఆపేసి వర్షంలో తడుస్తూనే తన స్పీచ్ ముగించారు.

Also Read: రామ్ చరణ్, సుకుమార్ మూవీపై క్రేజీ అప్డేట్ - హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

స్టెప్పులతో అదరగొట్టిన పవన్

స్పీచ్ తర్వాత శివమణిని డ్రమ్స్ వాయించమని అడిగిన పవన్... ఆయన వాయిస్తుండగా అందుకు తగినట్లు స్టెప్పులు వేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. ట్రైలర్ ఇంకా రెడీ కాలేదంటూ డైరెక్టర్ సుజీత్ చెప్పినా... బిగ్ షాట్స్ లేకపోయినా పర్వాలేదు ఫ్యాన్స్ కోసం ట్రైలర్ వేయాల్సిందే అంటూ పట్టుబట్టారు. పవన్ స్టేజీ మీద నుంచి వెళ్లేంత వరకూ వర్షాన్ని మూవీ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా లెక్క చేయలేదు. ఒంటి చేత్తోనే పవన్ ఈవెంట్‌ను బిగ్ సక్సెస్ చేశారు.

వర్షం పడడంతో తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ సాధ్యం కాలేదు. చాలామంది ప్రముఖులు మాట్లాడడం కుదరలేదు. అయినా పవన్ ఒక్కరే తన స్పీచ్, జోష్‌తో మూవీ టీంలోనూ జోష్ నింపారు. చాలా రోజుల తర్వాత పవన్‌ను కొత్తగా చూశామంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దటీజ్ పవన్ కల్యాణ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్రైలర్ ఎప్పుడు?

ఈవెంట్ బిగ్ సక్సెస్ అయినా అభిమానుల్లో కొంత నిరాశ మిగిలిపోయింది. అఫీషియల్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకపోవడంపై ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూవీ రిలీజ్‌కు ఇంకా 2 రోజులే ఉండడం... ఇప్పటివరకూ ట్రైలర్ రిలీజ్ కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెద్ద సినిమాలు అదీ పవర్ స్టార్ వంటి బిగ్ స్టార్ విషయంలో ఇలా చేయడం ఏంటని అంటున్నారు. త్వరగా ట్రైలర్ రిలీజ్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.