'ఖుషి' తర్వాత మళ్ళీ అభిమానుల్లో ఇంత జోష్ చూస్తున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన చెప్పారని కాదు... అభిమానుల్లో 'ఓజీ' మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. టైటిల్ గ్లింప్స్‌, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్, ఆఖరికి పోస్టర్స్... ప్రతిదీ సినిమాపై హైప్ పెంచాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సందడి నెలకొంది. టికెట్స్ ఓపెన్ చేయడం ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. పవర్ స్టార్ కెరీర్‌లో ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్ సాధించడం గ్యారెంటీ అని అర్థం అవుతోంది.

'ఓజీ' కలెక్షన్స్ @ 50 కోట్లు!
అక్షరాలా యాభై కోట్ల రూపాయలు... బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ / ప్రీ సేల్స్ ద్వారా 'ఓజీ' కలెక్ట్ చేసిన అమౌంట్. ఒక్క నార్త్ అమెరికా నుంచి రెండు మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. ఇండియన్ కరెన్సీలో ప్రీ సేల్స్ ద్వారా 'ఓజీ'కి వచ్చిన కలెక్షన్స్ 20 కోట్లకు పైమాటే.

నార్త్ అమెరికాలో ఫస్ట్ ప్రీమియర్ షో పడే సమయానికి ముందు 'ఓజీ' ప్రీ సేల్స్ 3 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విడుదలకు ముందు మూడు మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ ద్వారా కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా 'ఓజీ' రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read: నాగార్జున వందో సినిమా దర్శకుడితో... OG Heroine ప్రియాంక సినిమా... థియేటర్లకు కాదు, ఎందుకో తెలుసా?

ఇండియాలో పూర్తి స్థాయిలో 'ఓజీ' బుకింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఒక్క తెలుగు లాంగ్వేజ్ బుకింగ్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి. తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 'ఓజీ' పాతిక కోట్లకు పైగా రాబట్టింది. ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తే 'ఓజీ' ప్రీ సేల్స్ 50 కోట్లు దాటాయి.

పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ 'ఓజీ'!
మొదటి రోజు వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం 'ఓజీ'కి కేక్ వాక్. ఇప్పుడు వంద కోట్ల గురించి ఫ్యాన్స్ ఆలోచించడం లేదు. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి రికార్డులు క్రియేట్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. బిగ్గెస్ట్ ఓపెనర్ అవుతుందా? పాన్ ఇండియా మార్కెట్ లేకుండా బిగ్గెస్ట్ ఓపెనర్ రికార్డు క్రియేట్ చేయడం పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందా? అనేది చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ పెయిడ్ ప్రీమియర్ షోస్ ప్రదర్శనకు అనుమతులు రావడంతో పాటు టికెట్ రేట్ హైక్ రావడం వల్ల హిట్ టాక్ వస్తే రికార్డులు తిరగ రాయడం గ్యారంటీ.

Also Read: ఎక్స్‌క్లూజివ్... ఇంజ్యూరీ తర్వాత రోజు షూటింగ్‌ - దటీజ్ ఎన్టీఆర్, డెడికేషన్‌కు మారు పేరు