Nuvvunte Naa Jathaga Serial Today Episode శారద వాళ్లు బతుకమ్మ పెట్టి దండం పెట్టుకుంటారు. మిథున, దేవా కలిసిపోవాలని శారద మొక్కుకుంటుంది. ఇక భాను అయితే మిథున కోరిక నెరవేరకూడదు అని దేవా మీద తాను రుమాలు విసిరాను దేవా నాకే దక్కాలి.. మా అత్త కోరిక నెరవేరకూడదు అని అంటుంది. కాంతం భానుతో మనసులో మాటలు మైక్‌లో చెప్తున్నావ్ వద్దు అని అంటుంది. శారద నవ్వుకుంటుంది.

శారద దేవాని కూడా కోరుకోమని చెప్తుంది. నువ్వు అమ్మ కదా నీ కోరిక నెరవేరితే చాలు అని అంటాడు. ఇక దేవా కోసం పురుషోత్తం గుడికి వస్తాడు. దేవా వెళ్తుంటే మిథున దేవా వెనకాలే వెళ్తూ కుంకుమ పెడతానని దేవాతో చెప్తుంది. దేవా వద్దు అంటే మిథున పెడుతుంది. ఆ టైంలో మిథున పడిపోతుంటే దేవా పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. కుంకుమ బొట్టుతో ఎంత బాగున్నావో తెలుసా అని మిథున దేవాని అంటుంది. నాకు చాలా పనులు ఉన్నాయ్ నన్ను వదిలేయ్ అని దేవా వెళ్లిపోతాడు.

దేవా పురుషోత్తం కాలు మొక్కితే నువ్వు ఉండాల్సింది నా గుండెల్లో అని దేవాని హగ్ చేసుకుంటాడు. వదినను తీసుకొచ్చుంటే బాగున్ను అన్న అని దేవా అంటే నేను తీసుకురాకపోతే ఏంటి నువ్వు ఫ్యామిలీతో వచ్చావ్ కదా అని అంటాడు. దానికి దేవా అమ్మవాళ్లతో తను వచ్చింది అన్న అంటాడు. నువ్వు తను నీకు ఇష్టం లేదు అంటావ్.. ఇక్కడ చూస్తే అలా లేదు అని పురుషోత్తం అంటాడు. దానికి దేవా తనతో అదే సమస్య అన్న వద్దు అన్నా వినదు అని దేవా చెప్తాడు. ఇక దేవాని పురుషోత్తం వెళ్లిపోమని చెప్తాడు. పురుషోత్తం తన మనిషితో ఆదిత్య చెప్పింది కరెక్టేరా దేవా, మిథున కలిసి ఉంటే మిథున దేవాని నా దగ్గరకు రానివ్వదు అని అంటాడు. గుడిలోనే దేవాని చంపేయాలని పురుషోత్తం అనుకుంటాడు.

మిథున, సూర్యకాంతం ముత్తయిదువులకు కుంకుమ పెడతారు. ఇంతలో మిథున పుట్టింటి వాళ్లు వస్తారు. మిథున చాలా సంతోషపడుతుంది. అలంకృత అక్కతో మీకు ఇంకో సర్‌ఫ్రైజ్ అని చెప్పి మిథున ఫ్రెండ్స్‌ని చూపిస్తుంది. బ్రహ్మముడి కావ్య.. పాపే మా జీవనజ్యోతి సీరియల్‌లో కుట్టీ, మరో సీరియల్ నటి ఆనంది బతుకమ్మ తీసుకొని వస్తారు. వాళ్లని చూసి మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నలుగురు చక్కగా మాట్లాడుకుంటారు. మిథున వాళ్లని అత్తకి పరిచయం చేస్తుంది. కాంతాన్ని చూసి మీ తోటి కోడలు చాలా సరదాగా ఉంది మీకు ఫుల్‌గా టైం పాస్ అనుకుంటా అని అంటారు. నేను విలన్ అనుకుంటే మీరేంటి కామెడీ పీస్ అంటున్నారని కాంతం హర్ట్ అయిపోతుంది.

మిథున ఫ్రెండ్స్ దేవుడు ఇచ్చిన మీ భర్త ఎక్కడ అని అడుగుతారు. భార్యగా అంగీకరించని వాడు భర్త ఎలా అవుతాడని త్రిపుర అంటుంది. నీ బంధం గెలిపించుకోవడానికి చాలా కష్టపడుతున్నావని కావ్య అంటుంది. త్రిపుర ఓ చోట ఉంటే త్రిపుర చేతి బంగారు గాజులు కాంతం తీసుకుంటుంది. మిథున కొట్టకుండానే చెంప పగులేలా చేస్తుంది. అందరిలో మిథున పరువు పోవాలని కాంతంతో త్రిపుర చెప్తుంది. అప్పుడే ఓ జంట ఓ కంకణాన్ని తరతరాలుగా అమ్మవారిగా భావిస్తున్నాం అని బతుకమ్మ ఆడినప్పుడు అమ్మవారి దగ్గర పెట్టాలని మాట్లాడుకుంటారు. త్రిపుర అది వింటుంది. ఆ కంకణం కాంతానికి చూపించి అది మాయం చేసి ఆ క్రెడిట్ మిథున అకౌంట్‌లోకి వేయమని అంటుంది. దేవా కొంతమందితో మాట్లాడుతున్న దేవా దగ్గరకు వెళ్లి చేతికి కంకణం కట్టమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.