Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.దమయంతికి నిజం చెబుతుండగా విన్న అనసూయ రామలింగాన్ని నిలదీయడంతో విక్కీ,రాధది అగ్రిమెంట్ పెళ్లి అని చెప్పేస్తాడు.ఆ మాటలు విన్న రామచంద్రం షాక్‌కు గురవుతాడు. మరోవైపు రాధ,విక్కీ అగ్రిమెంట్ పెళ్లికి సంబంధించిన పత్రాలు రామలింగం కాల్చివేస్తుండగా భవానీశంకర్‌ అతన్ని కొట్టి లాక్కెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దాం
రామలింగాన్ని నిలదీసిన అనసూయ
దమయంతికి గట్టి వార్నింగ్ ఇచ్చి రామలింగం బయటకు వెళ్లిపోగా...అక్కడే ఉన్న అనసూయ ఆ మాటలన్నీ వింటుంది.వెళ్లి రామలింగాన్ని నిలదీస్తుంది. మర్యాదగా నిజం చెప్పమని అడుగుతుంది.మా అన్నయ్య వదినలది నిజమైన పెళ్లి కాదా అని ప్రశ్నిస్తుంది.ప్రియతో పెళ్లి తప్పించుకునేందుకు మీ అన్నయ్య రాధను ఏడాదిపాటు తన భార్యగా ఉండేలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడని చెబుతాడు. ఈలోగా ప్రియ మనసు విరిగిపోయి వేరే పెళ్లి చేసుకుంటుందని...ఆ తర్వాత రాధను వెనక్కి తిప్పి పంపిచాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడని చెబుతాడు. అప్పటి నుంచి వాళ్లు నిజమైన భార్యాభర్తల్లా నటిస్తూనే ఉన్నారని చెబుతాడు. అసలు మీరు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేశారని అను నిలదీస్తుంది.ఇప్పుడు ఇంట్లో వాళ్లకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తుంది. రాధ నిజమైన కోడలిగా భావిస్తున్న వీళ్లందరినీ ఎందుకు మోసం చేశారని మండిపడుతుంది. రేపు కాంట్రాక్ట్ అయిపోగానే రాధను వెనక్కి పంపిస్తే వీళ్ల పరిస్థితి ఏంటన్నది ఆలోచించారా అని అడుగుతుంది. ఈ విషయం పెదమామయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామచంద్రం వాళ్ల మాటలు విని షాక్‌తింటాడు. లోపలకి వెళ్లి చూడగా...విక్కీ,రాధ ఇద్దరూ భార్యాభర్తల్లా కూర్చుని వరలక్ష్మీవ్రతం చేస్తుంటే చూసి బాధపడి వెళ్లిపోతాడు. రామచంద్రం అలా బాధగా ఉండటాన్ని గమనించిన ప్రియా పెదనాన్న ఎందుకు అలా ఉన్నారని తల్లిని అడుగుతుంది.ఆయన అలా ఉన్నారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని...ఏం జరిగినా అది మన మంచికేనని అంటుంది.
భవానీ శంకర్‌ చేతికి అగ్రిమెంట్‌ పేపర్లు
రాధ,విక్కీ ఇప్పుడు ఎలాగూ ఒక్కటైపోయారని కాబట్టి ఇక ఈ అగ్రిమెంట్ పేపర్లతో వాళ్లకు పనిలేదని రామలింగం అనుకుంటాడు.ఇవి ఉండటం వల్లే అందరూ వాళ్లను బెదిరించాలని చూస్తున్నారని అందుకే వీటిని లేకుండా చేస్తే ఇక ఎవ్వరూ వాళ్లను విడదీయలేరని అనుకుంటాడు. పెళ్లి అగ్రిమెంట్ పేపర్లు కాల్చిబూడిద చేయాలని రామలింగం ప్రయత్నిస్తుండగా...అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ శంకర్‌ రామలింగాన్ని కొట్టి ఆ అగ్రిమెంట్ పేపర్లు లాక్కుంటాడు. వీటికోసమే మేం ఇన్నాళ్లు వెతుకుతుంటే...నువ్వు మాత్రం వీటిని తాపీగా కాల్చిపడేసి వాళ్లిద్దరినీ ఒక్కటి చేయాలని చూస్తావా అని అంటాడు. వీటిని అడ్డుపెట్టుకుని ఆ రాధను శాశ్వతంగా ఆ ఇంటి నుంచి దూరం చేస్తానని...ఆ విక్కీ భార్యగా నా మేనకోడలు ప్రియను కూర్చోబెడతానని భవానీ శంకర్ అంటాడు.అలా చేయవద్దని రామలింగం ఎంత వేడుకున్నా వినకుండా అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని భవానీశంకర్‌ వెళ్లిపోతాడు.
అపశకునం
వరలక్ష్మీవ్రతం చేస్తుండగా అమ్మవారికి హారతి ఇవ్వగానే...దీపం కొండెక్కుతుంది. ఏంటి ఇలా జరిగిందని రాధ చాలా బాధపడుతుంటుంది. అటు అనసూయ కూడా ఏదో కీడు జరగబోతుందని అనుమానిస్తుంది. కానీ విక్కీ కలుగజేసుకుని గాలికి దీపం ఆరిపోయిందని అంతే తప్ప....ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని అంటాడు. కానీ నాకు ఎందుకో జరగరానిది జరగబోతుందని అనిపిస్తోందని రాధ అంటుంది.నువ్వు ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా మళ్లీ ఇంకోసారి అమ్మవారికి హారతి ఇవ్వమని అంటాడు.దీంతో భయపడుతూనే రాధ అమ్మవారికి హారతి ఇస్తుంది.