Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. విక్కీ వాళ్ల మామయ్య రామచంద్రం కూతురు కోసం బాధపడుతున్నాడని తెలుసుకుని చిట్టీలా ఆయనకు రాధ కాల్‌చేస్తుంది. బర్త్‌డే పార్టీకి రేపు వస్తున్నానని చెప్పడంతో ఇళ్లంతా ఎంతో సందడి నెలకుంటుంది.
చిట్టి గురించి నిజం తెలుసుకున్న రాధ
స్టోర్‌రూమ్‌లో పాతకాలం నాటి పెయింటింగ్‌ ఒకటి దొరకడంతో అది తీసుకుని వచ్చి వాళ్ల అత్తయ్య సునందను ఇదేంటని అడుగుతుంది. అది చిన్నప్పుడు చిట్టి వాళ్ల నాన్న కోసం వేసిన పెయింటింగ్‌ అని చెబుతుంది. ప్రతి బర్త్‌డేకు చిట్టి వాళ్ల నాన్నకు ఇలాంటి గిప్ట్‌లు ఇస్తుందని చెబుతుంది. అలాగే వాళ్ల నాన్న బర్త్‌డేను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుందని వివరిస్తుంది. మా అన్నయ్య వేసుకునే షర్ట్‌ దగ్గర నుంచి....కట్‌ చేసే కేక్‌ వరకు అన్నీ చిట్టి సెలక్ట్‌ చేస్తుందని చెబుతుంది. అలాగే మా అన్నయ్య 8గంటలకు పుట్టాడని...కరెక్ట్‌గా 8 గంటలకు ఆయనతో కేక్‌ కట్‌ చేయిస్తుందని గొప్పగా చెబుతుంది. అది వెళ్లిపోయిన తర్వాత మా అన్నయ్య బర్త్‌డే చేసుకోవడమే మానేశాడని....ఈ ఇంటికి కళ లేకుండా పోయిందని బాధపడుతుంది. మళ్లీ చిట్టి వచ్చిన తర్వాతే బర్త్‌డే పార్టీ చేసుకుంటానని చెప్పాడని చెబుతుంది.
రాధకు నిజం చెప్పాలనుకున్న శీనయ్య
జైలు నుంచి ఆస్పత్రికి వెళ్తుంటే తనపై ఎటాక్‌ చేసింది ఖచ్చితంగా ఆ దమయంతి, భవనీ శంకర్‌ మనుషులేనని శీనయ్యకు అనుమానం వస్తుంది. నేను చనిపోక ముందే రాధకు నిజం చెప్పేయాలని అనుకుంటాడు. ఆ రాధ రామచంద్రంగారి కూతురని ఆమెకు చెప్పి వాళ్ల దగ్గరకు పంపించాలని భావిస్తాడు.ఇంతలో భార్య పద్మ రాగా...ఆమెకు కూడా ఇదే విషయం చెబుతాడు. రాధ మన కూతురు కాదన్న సంగతి చెప్పే సమయం వచ్చిందని అంటాడు. దీంతో ఆమె భయపడిపోతుంది. ఇన్నాళ్లు ప్రేమగా పెంచుకుని ఇప్పుడు కాదంటే నేను తట్టుకోలేనని అంటుంది.కానీ ఇప్పటికే నామీద రెండుసార్లు హత్యాయత్నం చేశారని...లోపల ఉన్న నేను, బయట ఒంటరిగా ఉన్న నువ్వు రాధను కాపాడలేమని అంటాడు.కాబట్టి వాళ్ల తల్లిదండ్రులకు ఈవిషయం చెబితే వారే ఆమెను కంటికిరెప్పలా కాపాడుకుంటారని వివరిస్తాడు. దీనికి పద్మ సరేనంటుంది. వాళ్ల అమ్మానాన్న ఎవరో చెప్పమని అడుగుతుంది. శీనయ్య చెప్పేలోగా ఎవరో వింటున్నారని గ్రహించి...రాధను తీసుకునిరా ఆమెకే ఈవిషయం చెబుతానని అంటాడు.
చిట్టిలా ఫోన్ చేసిన రాధ
కూతురి కోసం తపించిపోతున్న రామచంద్రాన్ని చూసి రాధ ఆమెలానే ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడుతుంది.నేను మీ చిట్టినని చెబుతుంది. దీంతో రామచంద్రం ఆనందానికి అవదుల్లేకుండాపోతాయి.ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అని అడిగితే....నేను బాగానే ఉన్నానని రేపు వచ్చి కలుస్తానని చెబుతుంది. రేపు మీ బర్త్‌డే కాబట్టి మీరు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తుంది. నేను ఖచ్చితంగా రేపు రాత్రి 8 గంటలకు మీరు కేక్‌ కట్‌ చేసే సమయానికి అక్కడ ఉంటానని చెప్పడంతో రామచంద్రం ఆనందంతో అందరినీ పిలుస్తాడు. మన చిట్టి మనకు దొరికిందని చెబుతాడు. దీంతో ఇంట్లో అందరూ ఎంతో సంతోషపడతారు.చిట్టి నాకు ఫోన్ చేసిందని.....రేపు మన ఇంటికి వచ్చేస్తుందని చెప్పిందని అంటాడు. దీంతో విక్కీ కూడా ఎంతో ఆనందపడిపోతాడు. రాధను పిలిచి ఇదంతా నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళా విషేషమని ఆమెను పొగుడుతాడు.