NTR వాయిస్ - VD వీరంగం - కింగ్ డమ్

9 months ago 8
ARTICLE AD

విజయ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. VD12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కింగ్‌డమ్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కింగ్‌డమ్ టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. కింగ్‌డమ్ టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. కింగ్‌డమ్ టీజర్ లోకి వెళితే.. అలసటలేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయిన, అలిసిపోయిన ఆగిపోని ఈ మారణహోమం, నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృత దేహాలు, ఈ అలజడి ఎవరి కోసం, ఇంత భీబత్సం ఎవరి కోసం, అసలీ వినాశనం ఎవరి కోసం, రణ భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రక్తం కోసం, కాల చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం.. అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు.. ఏమైనా చేస్తా సర్.. అవరసమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ తో కింగ్‌డమ్ టీజర్ కట్ ఉంది. 

మరి టీజర్ లో విజయ్ దేవరకొండ లుక్ ఓకె, BGM బావుంది. కానీ కింగ్‌డమ్ చూస్తున్నంతసేపు ఒక కెజిఎఫ్, ఒక దేవర, ఒక సలార్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అంటూ, ఒకరు రాజు కావడానికి ఎన్ని ప్రాణాలు బలి కావాలి, ఇదేనా కింగ్‌డమ్ కథ అంటూ నెటిజెన్స్ పెదవి విరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసాడనే మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక 2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో కింగ్‌డమ్ విడుదల కానుంది. 

Read Entire Article