North Korean elections: ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
3 weeks ago 2
ARTICLE AD
Kim wins North Korean election: ఉత్తర కొరియాలో  ప్రజాస్వామ్యం  ఏ స్థాయిలో పరిఢవిల్లుతుందో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా తాజా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  తాజాగా జరిగిన ఎన్నికల్లో సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఏకంగా 99.93 శాతం ఓట్లతో అఖండ విజయం సాధించి, తన రికార్డును తనే తిరగరాశారు. అయితే, ఆ మిగిలిన 0.07 శాతం మంది అతి తెలివి  ప్రదర్శించి వ్యతిరేకంగా ఓటు వేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద జోక్ అయిపోయింది. అసలు అక్కడ ఎన్నికలు జరగడం అంటేనే ఒక వింత అయితే, అందులో ప్రతిపక్షం లేకపోవడం మరో విచిత్రం.
🚨 THIS CAN’T BE REAL…
Kim Jong Un reportedly apologized for ONLY getting 99.93% of the vote… saying he’ll “do better next time” to reach 100%.
Meanwhile, people were seen crying in the crowd over the results…
That missing 0.07% must’ve been real bold…
Does this even… pic.twitter.com/rCmrOK1guf
— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) March 19, 2026
అయినా 0.07 వ్యతిరేకించారా?
ఈ 99.93 శాతం విజయం వెనుక ఉన్న ఆ  0.07 శాతం ' వ్యతిరేకతను చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది. బహుశా ఆ కొద్దిమందికి పెన్ను సరిగ్గా పని చేయలేదో లేక పొరపాటున గీత గీశారో కానీ, కిమ్ రాజ్యంలో అసమ్మతికి చోటు ఉందన్న భ్రమ కలిగించడానికి ఇది ఒక మాస్టర్ ప్లాన్  అని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి అక్కడ ఎన్నికలు అంటే నాయకుడిని ఎన్నుకోవడం కాదు, ప్రజలంతా తన అడుగుల కింద ఉన్నారా లేదా అని కిమ్ చెక్ చేసుకునే ఒక  అటెండెన్స్ రిజిస్టర్  లాంటివి మాత్రమే.
Supreme leader Kim Jong Un just personally apologized for getting only 99.93% of the vote 😭
“I am deeply hurt. Next time I will work harder for 100%.
The 0.07% who didn’t vote for me will face no discrimination at all. pic.twitter.com/9KnX3AsHg2
— Raghu (@IndiaTales7) March 18, 2026
ఈ ఎన్నికల ఫలితాలు చూశాక, ఇతర దేశాల రాజకీయ నాయకులు కుళ్ళుకోవడంలో ఆశ్చర్యం లేదు. కనీసం ప్రచారం అక్కర్లేదు, ప్రత్యర్థి అరుపులు ఉండవు, సర్వేల గోల అస్సలే ఉండదు. కిమ్ గారి రాజ్యంలో ఓటరుకు ఉన్న ఏకైక హక్కు  ఔను  అని తలూపడమే. ఒకవేళ ఎవరైనా పొరపాటున కాదు  అంటే, అది వారి జీవితంలో చివరి ఓటు అయ్యే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా, 0.07 శాతం మందిని  వదిలేయడం  ద్వారా కిమ్ గారు తన  ఉదారతను  చాటుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు  సెటైర్లు వేస్తున్నారు.
Read Entire Article