Bollywood Actress Nora Fatehi Apology Over Sarke Chunar Song Controversy : బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి జాతీయ మహిళా కమిషన్ ముందు క్షమాపణలు చెప్పారు. 'కేడీ ది డెవిల్' మూవీలో... సంజయ్ దత్, నోరా ఫతేహి కలిసి స్టెప్పులేసిన 'సర్కే చునార్ తేరీ సర్కే' సాంగ్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రియాక్ట్ అయిన నోరా... తాజాగా జాతీయ మహిళా కమిషన్ ముందు క్షమాపణ చెప్పారు.

బాలికల చదువుకు ఆర్థిక సాయం

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు నోరా ఫతేహి. 'ఓ నటిగా బాధ్యతగా ఉండాలి. దీనికి దిద్దుబాటు చర్యగా పలువురు అనాథ బాలికల చదువుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నా.' అని చెప్పారు. గతంలోనూ ఆమె ఈ పాట వివాదంపై వివరణ ఇచ్చారు. హిందీ వెర్షన్‌లో చేంజెస్ గురించి తనకు తెలియదని అన్నారు.

మూడేళ్ల క్రితం కన్నడ వెర్షన్ సాంగ్ షూటింగ్ జరగ్గా... పెద్ద సినిమా కావడం, సంజయ్ దత్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో అంగీకరించినట్లు వెల్లడించారు. కన్నడ అర్థం కాకపోవడంతో వారు చెప్పిన దానిపైనే ఆధారపడ్డానని... ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు అసభ్యకరంగా ఉన్నట్లు అనిపించలేదని చెప్పారు.

Also Read : 'సతీ లీలావతి' రివ్యూ: భర్తను కట్టేసి కొట్టేసిన భార్య... మెగా కోడలు లావణ్య సినిమా హిట్టా? ఫట్టా?