Nindu Noorella Saavasam Serial Today Episode:  రాథోడ్‌లో ఉన్న దెయ్యం బస్సును పంక్చర్‌ అయ్యేలా చేస్తుంది. బస్సు పంక్చర్‌ కాగానే రాజు, డ్రైవర్‌ పంక్చర్‌ వేయించడానికి సిటీ వైపు వెళ్తారు. రాథోడ్‌ అందరినీ తీసుకెళ్లి ప్రచండకు అప్పగిస్తాడు. అప్పుడే రాథోడ్‌లోని దెయ్యం బయటకు వెళ్లిపోతుంది. మరోవైపు మనోహరిని ఫాలో అవుతున్న అమర్‌ దగ్గరకు వెళ్లి మనోహరిని ప్రశ్నిస్తాడు. ఇంకా ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలను ప్రచండకు అప్పగించిన రాథోడ్‌

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!" href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

దెయ్యం పట్టిన రాథోడ్‌ తన మాటలతో అందరిని అడవిలోకి తీసుకెళ్తాడు. ప్రచండ ఉన్న చోటికి వెళ్లాక రాథోడ్‌ను ఆవహించిన దుష్టశక్తి బయటకు వెళ్తుంది. రాథోడ్‌ స్పృహ తప్పి కింద పడిపోతాడు. భాగీ, పిల్లలు, సరస్వతి వార్డెన్‌ భయపడుతుంటారు. భాగీ రాథోడ్‌ను లేమని పిలుస్తుంటే.. అప్పుడే రాథోడ్‌ లోంచి బయటకు వచ్చిన దెయ్యం ప్రచండ నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నేను వెళ్తాను అంటూ చెప్పి వెళ్లడం అందరూ చూసి భయపడతారు.

ప్రచండను కొట్టబోయిన రాథోడ్‌ – మంత్రం వేసిన ప్రచండ

స్పృహలోంచి బయటకు వచ్చిన రాథోడ్‌ ఏమీ తెలియనట్టు మిస్సమ్మ మనం ఎక్కడ ఉన్నాం.. అడవిలోకి ఎందుకు వచ్చాము అంటాడు. నువ్వే ఇక్కడకు తీసుకొచ్చావు రాథోడ్‌ అంటూ భాగీ చెప్పగానే..రాథోడ్‌ కోపంగా ఒరేయ్ ప్రచండ ఇది నీ పనా..? నిన్ను చంపేస్తానురా అంటూ మీదకు వెళ్తుంటే.. ప్రచండ మంత్రం వేసి రాథోడ్ ఫ్రీజ్‌ అయిపోయేలా చేస్తాడు. నువ్వే కాదురా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరురా..? ఈ క్షణం కోసమే నేను ఎదురుచూస్తున్నాను. శక్తులు నా సొంతం అయ్యే సమయం ఆసన్నమైంది. నన్ను ఇంక ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటాడు.

ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన భాగీ

భాగీ కూడా కోపంగా నువ్వు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు రాథోడ్‌, మేడం పిల్లలను తీసుకుని బస్సు దగ్గరకు బయలుదేరండి అంటూ వెళ్లబోతుంటే.. ప్రచండ తన మంత్రంతో అందరి చుట్టూ బంధనం వేసి కదలకుండా చేస్తాడు. నోటి దగ్గరకు వచ్చిన లేడి పిల్లను సింహం వదిలిపెడుతుందా..? ఇది నా మంత్ర బలం నిండిన స్థలం. ఇక్కడికి రావడమే కానీ తిరిగి వెళ్లడం జరగదు. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అందరూ లోపలికి వెళ్లండి. కాద్రా వీళ్లను లోపలికి తీసుకెళ్లు అని చెప్పగానే.. కాద్రా అందరినీ లోపలికి తీసుకెళ్తాడు.

అందరినీ తీసుకెళ్లి బంగ్లాలో బంధించిన ప్రచండ

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

అందరూ లోపలికి వెళ్లాక కాద్రా కోపంగా అందరూ ఇక్కడే కూర్చోండి నేను చెప్పేంత వరకు ఎవ్వరూ కదలొద్దు అంటూ బెదిరించగానే.. అందరూ కూర్చుంటారు. రాథోడ్‌ బాధగా ఇదంతా నా వల్లే కదా మిస్సమ్మ నన్ను క్షమించు అంటే.. వాడు మాయ చేస్తే నువ్వేం చేస్తావు రాథోడ్‌ అంటుంది. అసలు ఎవ్వడమ్మా వాడు అని సరస్వతి అడిగితే ప్రచండ అనే దుర్మార్గపు మాంత్రికుడు మమ్మల్ని టార్గెట్‌ చేశాడు. అందుకే పిల్లలను బయటకు పంపడం లేదు అని భాగా చెప్పగానే.. అయ్యో ఆ విషయం తెలియక నేను అనవసరంగా బయటకు తీసుకొచ్చాను అంటుంది సరస్వతి. రాథోడ్‌ కూడా బాధగా మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొస్తానని సార్‌కు మాటిచ్చాను. ఇక ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి మిస్సమ్మ అంటే.. ఎలాగైన బయట పడాలి రాథోడ్‌. బయటి నుంచి సాయం అందుతుందేమో చూడాలి అంటుంది భాగీ. సార్‌కు ఓసారి ఫోన్‌ చేయండి మిస్సమ్మ అంటూ రాథోడ్ చెప్పగానే.. ఇందాకే చేశాను ఇక్కడ సిగ్నల్స్‌ లేవు అంటుంది భాగీ. అమరేంద్ర గారికి తెలిస్తే ఆయన ఎలాగోలా మనల్ని రక్షిస్తారు అంటుంది సరస్వతి.

మనోహరికి షాక్‌ ఇచ్చిన అమర్‌

భాగీ చనిపోవడం తన కళ్లతో చూసి ఆనందించాలనుకున్న మనోహరి శ్రీశైలం ఫారెస్ట్‌లో వెళ్తుంది. వెనకాలే అమర్‌ వెళ్తుంటాడు. కొద్ది దూరం వెళ్లాక మనోహరి ఖాళీగా ఉన్న బస్సును చూసి సంతోషిస్తుంది. అప్పుడే వెనక నుంచి అమర్‌ వస్తాడు. అమర్‌ను చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మనోహరి అని అమర్‌ అడిగితే మనోహరి మౌనంగా ఉండిపోతుంది. షాపింగ్‌కు వెళ్తానన్నావు.. తోడుగా పార్థు వస్తానంటే వద్దన్నావు.. సడెన్‌గా రూటు ఎందుకు మార్చావు.. అని అడగ్గానే.. నేను షాపింగ్‌కు అనే బయలుదేరాను అమర్‌ కానీ అంటూ చెప్పబోతుంటే.. కానీ ఏంటి..? నా దగ్గర ఏం దాస్తున్నావు.. నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు.. అనగానే.. మనోహరి భయంతో నేను నీ దగ్గర ఏం దాస్తాను అమర్‌.. అంటుంది. సూటిగా అడుగుతున్నాను స్ట్రెయిట్‌ గా ఆన్సర్‌ చెప్పు మనోహరి నేను నిన్ను ఇంటి దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను అనగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?