Nindu Noorella Saavasam Serial Today Episode: నందగిరిహిల్స్‌లో అటాక్‌ చేసిన రౌడీల గురించి ఎంక్వైరీ చేశావా అని అమర్‌ పార్థును అడిగితే పెట్రోలింగ్ పోలీసులకు చెబితే పట్టుకోవడం కష్టం అన్నారంటాడు పార్థు. తర్వాత సరస్వతి వార్డెన్‌ వచ్చి పిల్లలను టూర్‌కు పంపించమని అడుగుతుంది. అమర్‌ ఓకే అన్నా భాగీ భయపడుతుంది. ఇంకా నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

దొంగలను పట్టుకోవడం అసాధ్యం అన్న పార్థు

ఇంటికి వెళ్లిన తర్వాత మరుసటి అటాక్‌ చేసిన రౌడీల గురించి ఎంక్వైరీ చేశావా..? అంటూ అమర్‌, పార్థును అడుగుతాడు. అందుకు పార్థు పెట్రోలింగ్‌ పోలీసులకు చెప్పానని వాళ్ల ముఖాలు మనం చూడనందు వల్ల పట్టుకోవడం కొంచెం కష్టమే అంటున్నారు అని పార్థు చెప్పగానే.. రాథోడ్‌ వాళ్లు కచ్చితంగా దారిదొపిడీ దొంగలైతే కాదు సార్‌. మిమ్మల్ని చంపడానికి వచ్చిన గ్యాంగే అయి ఉంటుంది. మీరు కచ్చితంగా ఎంక్వైరీ చేస్తే వాళ్లను వాళ్ల వెనక ఉన్నవాళ్లను అసలు వదలొద్దు సార్‌ అని చెప్తుండగానే.. వార్డెన్‌ సరస్వతి, రాజు వస్తారు.

అమర్‌కు సారీ చెప్పిన సరస్వతి వార్డెన్‌

ఏంటి మేడం ఇలా వచ్చారు అని అమర్‌ అడిగితే.. సారీ సార్‌ ఆగష్టు 15వ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది సారీ సార్‌ అని సరస్వతి చెబితే.. దానికి మీరేం చేస్తారు అనుకోకుండా అలా జరిగిపోయింది. కాకపోతే లక్కీగా ఎవ్వరికీ ఏం కాలేదు అని చెప్పగానే.. అవును సార్‌ కాకపోతే మీరు వచ్చినప్పుడే ఇలా జరగడం కొంచెం బాధగా ఉంది.. పోలీసులను పిలిచి పార్థు సార్‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగిపోయింది అంటూ రాజు చెప్తుంటే.. కొన్నిసార్లు అలా జరుగుతుంది రాజు గారు ప్రకృతిని మనం ఆపలేం కదా అంటాడు. అప్పుడే కాఫీ తీసుకుని వస్తుంది భాగీ.

పిల్లలను టూర్‌ కు పంపించమన్న సరస్వతి

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

ఆశ్రమం పిల్లలను నాగార్జున సాగర్‌ కు టూర్‌కు తీసుకెళ్తున్నామని మీరు కూడా మీ పిల్లలను పంపిస్తారేమోనని అడగడానికి వచ్చినట్టు సరస్వతి చెప్పగానే.. అప్పుడే వచ్చిన పిల్లలు తాము టూర్‌కు వస్తామని ఉత్సాహంగా చెప్తారు. కానీ భాగీ వద్దని వారిస్తుంది. భయంగా పిల్లలకు మళ్లీ ఏదైనా ఆపద వస్తుందేమోనని గాబరా పడుతుంది. అమర్‌ మాత్రం వాడెవడికో భయపడి పిల్లలను బయటకు పంపకపోతే ఎలా అంటూ చెప్పగానే.. భాగీ అయితే మనం వేరుగా వెళ్దామని చెప్తుంది. సాటి పిల్లలతో వెళితే వాళ్లు హ్యాపీగా ఉంటారని.. నీకు అంత భయంగా ఉంటే నువ్వు వాళ్లతో పిల్లలకు తోడుగా వెళ్లు అని చెప్పగానే.. రాథోడ్‌ కూడా అవును మిస్సమ్మ మనం వెళితే పిల్లలకు ఏమీ కాకుండా చూసుకుంటాము కదా మనకు తోడుగా రాజుగారు, సరస్వతి గారు ఉంటారు కదా అంటాడు.

పోలీసులను సెక్యూరిటీగా పంపిస్తామన్న పార్థు

పార్థు కూడా భాగీ గారు పిల్లలు ఆశపడుతున్నారు కదా పైగా వీళ్లు కూడా స్పెషల్‌ గా వచ్చి పిలుస్తున్నారు వెళ్లండి కావాలంటే నేను సాగర్‌ పోలీసులతో మాట్లాడి మీకు సెక్యూరిటీ ఇప్పిస్తాను అని చెప్పగానే.. అమర్‌ పోలీసుల సెక్యూరిటీ చాలా..? లేక ఆర్మీని కూడా దింపమంటావా..? అనగానే.. వద్దులేండి మేము వెళ్తాం అని చెప్తుంది భాగీ. రాజు థాంక్యూ మేడం అంటాడు. పిక్నిక్‌ కోసం ఒక బస్సు మాట్లాడతామని సరస్వతి చెబితే.. మీరు వద్దు నేనే మాట్లాడతాను.. ఎప్పుడు బయలుదేరుతారు అని అడగ్గానే.. ఈరోజు లంచ్‌ చేసి వెళ్తామని రాజు చెబితే సరే అ టైంకు బస్సు వస్తుంది. అని అమర్‌ చెప్పగానే.. సరే వెళ్తామని సరస్వతి చెప్పగానే.. అదేంటి మనోహరిని కలవకుండా వెళ్తారా అంటే ఇంకోసారి వచ్చినప్పుడు కలుస్తామని చెప్పి వెళ్లిపోతుంది సరస్వతి. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?