Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆశ్రమం నుంచి వస్తున్న రాథోడ్‌కు రోడ్డు పక్కన అమర్‌ కారు కనిపించడంతో తమ కారును ఆపేస్తాడు. కారులోంచి దిగిన చంభా తయారు చేసిన కుక్క భాగీ మీదకు అరుస్తూ వెళ్తుంది. ఇంకా ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

భాగీ మీదకు దూసుకెళ్లిన చంభా పంపిన కుక్క

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

భాగీని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు మనోహరి కారును ఆపాలని ప్రయత్నిస్తుంది. అప్పుడే ఎదురుగా ఆగిపోయిన అమర్‌ కారు చూసిన రాథోడ్‌ తమ కారును ఆపేస్తాడు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. భాగీ కారెందుకు ఆపావని అడిగితే ఎదరుగా అమర్‌ కారు ఉందని చూపిస్తాడు. అందరూ కిందకు దిగతారు. అమర్‌ కారు దగ్గరకు వెళ్తుంటే.. అప్పుడే చంభా మంత్రం వేసిన కుక్కను భాగీ మీదకు ఉసిగొల్పుతుంది. ఆ కుక్క భాగీని చూసి మొరుగుతుంది.

కుక్కను మనోహరి మీదకు మళ్లించిన ఆరు ఆత్మ

రాథోడ్ రాయి తీసుకొచ్చి కుక్కను కొట్టబోతుంటే.. రాథోడ్‌ను భాగీ ఆపేస్తుంది. మూగజీవి అని ఆలోచిస్తున్నారా మేడం అంటూ రాథోడ్‌ అడిగితే.. ఇది మూగ జీవి కాదు మంత్రజీవి అంటూ చెప్పగానే.. మనోహరి, రాథోడ్‌ షాక్‌ అవుతారు. భాగీ కళ్లల్లోంచి మెరుపు వచ్చి కుక్కలోకి వెళ్తుంది. వెంటనే ఆ కుక్క మనోహరి వైపు వెళ్తుంది. మనోహరి భయంగా ఇదేంటి నా వైపు తిరుగుతుంది అని మనసులో భయపడుతూ అనుకుంటుండగానే.. కుక్క మనోహరి మీదకు వెళ్తుంది. మనోహరి అక్కడి నుంచి పారిపోతుంది. కుక్క వెనకాలే వెంబడిస్తుంది. చాటు నుంచి చూస్తున్న చంభా భైరవ నువ్వు వెంబడించాల్సింది మనోహరిని కాదు.. భాగీని అంటుంది. అయినా ఆ కుక్క మనోహరిని వెంబడిస్తుంది. చంభా మంత్రదండతో మంత్రించి కుక్కును ఆపాలని చూస్తుంది. కానీ కుక్క వినదు.. దీంతో చంభా భయంగా అదేంటి నా మంత్రం పనిచేయడం లేదు. ఆ ఆత్మ శక్తి ముందు నా మంత్ర శక్తి పని చేయడం లేదు అనుకుంటుంది.

ప్రాణభయంతో పరుగులు పెట్టిన మనోహరి

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

మనోహరి భయంతో పరుగెడుతూ నన్ను కాపాడు అరుంధతి.. అంటూ కేకలు వేస్తుంది. రాథోడ్‌ ఆశ్చర్యంగా అదేంటి మేడం నన్ను కాపాడు భాగీ అనో లేక నన్ను కాపాడు రాథోడ్‌ అనో కేకలు వేయాలి కానీ అరుంధతి అంటుందేంటి అని అడగ్గానే.. దానికి నా గురించి తెలిసిపోయింది రాథోడ్‌ అని భాగీలోని ఆరు చెప్తుంది. రాథోడ్‌ భయంగా మేడం మనోహరి గారిని కుక్క కరిస్తే పెళ్లి ఆగిపోతుంది. మనోహరిని కాపాడండి మేడం అంటే.. కాసేపు పరుగులు పెట్టని రాథోడ్‌ అది నా కూతురును కూడా ఇలాగే చేసింది కదా..? అనగానే.. రివేంజ్‌ తీర్చుకుంటున్నారా మేడం అని రాథోడ్‌ అడిగితే.. బుద్ది చెప్తున్నాను రాథోడ్‌ అంటుది ఆరు.. చాటు నుంచి చూస్తున్న చంభా కుక్క చావు అంటే ఇదేనేమో…? మనోహరి కుక్క చేతిలో చావబోతుంది. ఇంకా నయం కాపాడు అరుంధతి అని అరిచింది. కాపాడు చంబా అని అరిచి నన్ను బయట పెట్టలేదు అనుకుంటుంది.

కుక్కను తరిమేసి మనోహరిని సేవ్‌ చేసిన అమర్‌

అప్పుడే అక్కడకు అమర్ వస్తాడు. మనోహరి వెనకాల కుక్క పరుగెత్తడం చూసి గన్‌ పేలుస్తాడు. ఆ సౌండ్‌కు కుక్క పారిపోతుంది. అమర్‌.. మనోహరి ఆర్‌యూ ఆల్ రైట్‌ అని అడిగితే.. భాగీ అందుకే మనోహరి పెళ్లి కూతురును చేశాక బయటకు రాకూడదు అని చెప్పిందే ఇప్పుడు చూడు ఏమైందో.. అనగానే.. భాగీ నీకేం కాలేదు కదా అని అమర్‌ అడుగుతాడు. భాగీలో ఉన్న ఆరు నాకేం అవుతుందండి మనోహరికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. కొంచెం మంచినీళ్లు తీసుకొచ్చి ఇవ్వు రాథోడ్‌ మనోహరి కుదుట పడుతుంది అని చెప్పగానే.. మనోహరి అవసరం లేదు అంటుంది. మీరేం సార్‌ ఇలా వచ్చారు అని రాథోడ్‌ అడిగితే అది నేను వేరే పని మీద వచ్చాను నా కారు టైర్‌ పంక్చర్‌ అయింది అని చెప్పగానే.. మీ కారు చూసి మేము ఆగామండి అంతలో ఆ పాడు కుక్క వచ్చి దాడి చేసింది. మీరు రాకపోయి ఉంటే మనోహరి పని అయిపోయి ఉండేది అని భాగీ చెబితే.. ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు వెళ్దాం పదండి అంటూ అమర్‌ చెప్పగానే.. సార్‌ మేడం గారిని మనోహరి గారిని తీసుకుని మీరు కారులో వెళ్లండి నేను కారు పంక్చర్‌ వేయించుకుని వస్తాను అని చెప్పగానే.. అందరూ వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?