Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని పెళ్లికూతురును చేసేందుకు మిస్సమ్మలో ఉన్న ఆరు బయటకు తీసుకెళ్తుంది. మనోహరి అఇష్టంగానే బయటకు వెళ్తుంది. అందరూ మనోహరికి నలుగు పెడుతుంటే.. భాగీని పక్కకు తీసుకెళ్లి ఎమోషనల్ అవుతాడు అమర్‌. అమర్‌ను చూసి ఆరు ఎమోషనల్‌ అవుతుంది. భాగీ తాను ఉన్నానని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనోహరికి నలుగు పెట్టిన అంజు

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

భాగీలో ఉన్న ఆరు వెళ్లి మనోహరిని బయటకు తీసుకొస్తుంది. బయట కూర్చోబెట్టి నలుగు పెడుతుంది. అంతా తెలిసినా మనోహరి ఏమీ అనలేకపోతుంది. అందరూ సంతోషంగా చూస్తుంటారు. అంజు కూడా తాను నలుగు పెడతానని అడిగితే పెట్టమ్మా పెట్టాలి కూడా అంటూ మిస్సమ్మ చెప్పగానే.. కన్నతల్లికి కన్నకూతురు నలుగు పెడుతుంది. ఇదేనేమో విధి విచిత్రం అంటే అని రాథోడ్‌ మనసులో అనుకుంటాడు. ఇక అమర్‌, మిస్సమ్మను ఒకసారి లోపలికి రా మాట్లాడాలి అని తీసుకెళ్తాడు.

భాగీకి థాంక్స్‌ చెప్పిన అమర్‌

లోపలికి వెళ్లాక మిస్సమ్మ ఏంటండి అక్కడ అందరు ముత్తైదువలు ఉంటే మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగితే.. అమర్‌, మిస్సమ్మ చేతులు పట్టుకుని కళ్లల్లోకి చూస్తూ.. థాంక్స్‌ భాగీ అనగానే.. ఎందుకు అని మిస్సమ్మ అడిగితే.. మనోహరి పెళ్లి గ్రాండ్‌గా జరిపిస్తున్నందుకు అని చెప్పగానే.. ఈ మాత్రం దానికే థాంక్స్‌ ఎందుకు అయినా మనోహరి పెళ్లి చేస్తానని అనాథ శరణాలయంలో మాటిచ్చాను కదా అనగానే.. అమర్‌ షాకింగ్‌గా ఏంటి మనోహరికి పెళ్లి చేస్తానని అనాథ శరణాలయంలో మాటిచ్చావా..? మనోహరికి మాటిచ్చింది మీ అక్క కదా అని అమర్‌ అడగ్గానే.. మిస్సమ్మ అలియాస్‌ ఆరు.. అక్క మాటిస్తే ఒకటి.. నేను మాటిస్తే ఒకటా అండి.. అక్క బాధ్యత నా బాధ్యత కాదా..? అంటుంది.

భాగీని మెచ్చుకున్న అమర్‌ - ఎమోషనల్‌ అయిన ఆరు

అమర్‌ నిజమే భాగీ మీ అక్కే ఉండి ఉంటే మనోహరి పెళ్లి ఎలా చేసేదో నువ్వు అంతకంటే బాగానే చేస్తున్నావు..? నీలో నాకు మీ అక్కే కనిపిస్తుంది అంటూ అమర్‌ చెప్పగానే.. ఆరు అలియాస్‌ మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంది. నిన్ను చూస్తుంటే.. నాకు సంతోషంగా గర్వంగా ఉంది థాంక్యూ సోమచ్‌ అంటూ హగ్‌ చేసుకుని నేను మీ అక్కను పోగోట్టుకున్న దురదృష్టవంతుడినో.. లేక నిన్ను పొందిన అదృష్టవంతుడినో చెప్పలేను అందుకే థాంక్స్‌ అది చెప్పడానికే నిన్ను ఇక్కడకు తీసుకొచ్చాను అంటూ అమర్‌ చెప్తుంటే.. మిస్సమ్మలో ఉన్న ఆరు తాను భాగీలో ఉన్నానని నిజం చెబితే.. మీరు ఏడుస్తారేమో అని మనసులో అనుకుంటుంది. అప్పుడే అమర్‌కు ఫోన్‌ రావడంతో వెళ్లిపోతాడు.

అరుంధతితో మాట్లాడిన రాథోడ్‌

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

బయట ముత్తైదువులు అందరూ మనోహరికి నలుగు పెడుతుంటారు. మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్‌ లోపలికి వెళ్లి మేడం బయట అందరూ నలుగు పెడుతున్నారు. మీరొస్తే మంగళ స్నానం మొదలు పెడతారట అని చెప్పగానే.. ఎమోషనల్‌ అవుతున్న ఆరు రాథోడ్‌ ఆయన నా చేతులు పట్టుకుని హగ్‌ చేసుకున్నారు.. భాగీని పొగిడారు.. నాకు చాలా ఆనందంగా ఉంది రాథోడ్‌ ఇన్నా్ళ్లు ఆయన ప్రేమకు దూరమై ఏడుస్తున్న నాకు ఇది మంచి ఓదార్పు కదా..? ఎన్నో రోజుల తర్వాత ఆయనకు దగ్గర కావడం అమ్మ జోలపాటలా ఉంది రాథోడ్‌. ఆయన నాపై చూపించిన ప్రేమ అమృతంలా ఉంది.. నేను చనిపోలేదు రాథోడ్‌.. అమృతం లాంటి ఆయన ప్రేమ పొందాక నాకు చావు ఎలా ఉంటుంది ఆయన గుండెల్లో నేను ఎప్పటికీ బతికే ఉంటాను.. అంటూ చెప్తుంటే.. రాథోడ్ కూడా అవును మేడం నీ ప్రేమకు చావు లేదు.. అంటూ వెనక నుంచి వస్తున్న అమర్‌ను చూసి ఆరుకు సైగ చేస్తాడు.

భాగీని అనుమానించిన అమర్‌

దగ్గరకు వచ్చిన అమర్‌.. ఏంటి రాథోడ్‌ కొత్తగా మేడం అని పిలుస్తున్నావు ఎప్పుడూ మిస్సమ్మ అని పిలిచేవాడివి కదా అంటే.. అంటే సార్‌ మనం మాత్రమే ఉన్నప్పుడు మిస్సమ్మ అంటాను.. ఇప్పుడు బయటి వాళ్లు వచ్చారు కదా మేడం అంటున్నాను అని రాథోడ్‌ చెబితే.. ఇక్కడ బయటి వాళ్లు ఎవరూ లేరు కదా అని అమర్‌ అడిగితే.. బయట పిలిచి అలవాటుగా ఇక్కడా అలాగే పిలిచాను సార్‌ అనగానే.. అమర్‌.. ఏంటి మిస్సమ్మ నేను కూడా నిన్ను మేడం అని పిలవాలా..? అంటే మీకు అంత సరదా ఉంటే పిలవండి అంటూ భాగీ అలియాస్‌ ఆరు బయటకు వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?