Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో భాగీ చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిపోతుంది మనోహరి. ఆదే సంతోషంలో ఇంటికి వస్తుంది. పిల్లలను పిలిచి ఈరోజు నుంచి మీకు ఫ్రీడమ్‌ ఇస్తున్నాను అని చెప్తుంది. పిల్లలు, రాథోడ్‌ షాక్‌ అవుతారు.

చంభా: ( మనసులో) ఈమెను బెలూన్‌ ను చేసి గాల్లోకి ఎగిరేస్తున్నారు. బంతిలా ఆడేసుకుంటున్నారు.. ఈవిడకు మాత్రం తెలియడం లేదు

రాథోడ్‌: ఏంటి మనోహరి గారు ఏదో గాలిలో తేలిపోతున్నారు

మనోహరి: అవును రాథోడ్‌ నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి బై

అంటూ వెళ్లిపోతుంది.

రాథోడ్‌: ఎలా ఉన్న మనోహరి గారు ఎలా అయిపోయారు.. ఏంటి యాదమ్మ మీ మనోహరి మేడం అలా అయిపోయారు

చంభా: ఏమో రాథోడ్‌ సార్‌ నాకేం తెలుసు

రాథోడ్‌: నీకు తెలియదా..?

చంభా: తెలియదు సార్‌ మనోహరి మేడం

అనుకుంటూ చంభా వెళ్లిపోతుంది.

అంజు: రాథోడ్‌ ఎప్పుడూ సీరియస్‌గా ఉండో మనోహరి ఆంటీ ఇంత జోస్‌గా ఉందేంటి..?

అమ్ము: అవును రాథోడ్‌ హిట్లర్‌ లా ఉండే మనోహరి ఆంటీ జోకర్‌ లా చేస్తుందేంటి..?

రాథోడ్‌: ఇక నుంచి బఫూన్‌లా ఎంటర్‌ టైన్‌ చేస్తుంది అమ్ము

ఆనంద్‌: అంటే మనోహరి ఆంటీ కమెడియన్‌ అవుతుందా రాథోడ్‌

రాథోడ్‌: ఇన్నాళ్లు విలన్‌ అయిందిగా ఇప్పుడు కమెడియన్‌ అవుతుంది

ఆకాష్‌: మనోహరి ఆంటీ కామెడీ చేస్తే చండాలంగా ఉంది రాథోడ్‌

రాథోడ్‌: తప్పదు మరి భరించాలి. ఇక నుంచి ఆ కామెడీయే మనం చూడబోతున్నాం. సరే సరే మనం వెళ్లి బుజ్జితల్లిని చూసొద్దాం పదండి

అని అందరినీ తీసుకుని కారేసుకుని వెళ్లిపోతాడు రాథోడ్‌. పాట పాడుతూ లోపికి వెళ్లిన మనోహరిని పైనుంచి అమర్ గమనించి పిలుస్తాడు. పాట పాడటం ఆపేస్తుంది మనోహరి. అమర్‌ దగ్గరకు వస్తాడు.

మనోహరి: ఏంటి అమర్‌

అమర్‌: నువ్వు వెళ్లి పాపను తీసుకురా

మనోహరి: ఏ పాపను అమర్

అమర్‌: నా పాపని తను నా పాప. నా దగ్గరే ఉండాలి

మనోహరి: ( మనసులో.. పిల్ల మాత్రమే వచ్చి తల్లి రాకపోతే నా పెళ్లి ఎలా అయ్యేది.) అదేంటి అమర్‌ నీకు పాప మాత్రమే కావాలా..? భాగీ వద్దా

అమర్‌: ఆ పేరే ఎత్తోద్దు మనోహరి. తను అంటే నాకు కోపం, ధ్వేషం, అసహ్యం.

మనోహరి: (మనసులో నాకు కావాల్సింది కూడా అదే) అలా అంటావేంటి అమర్‌ ఎంతైనా భాగీ నీ భార్య. అరుంధతికి చెల్లెలు, ఏదో కారణం వల్ల నీకు దూరమైతే నువ్వు కూడా తనను దూరం పెడతావా..? గుడిలో నువ్వు తనతో అలా రాష్ గా మాట్లాడటం నాకు నచ్చలేదు అమర్‌. నాకు చాలా బాధేసింది. నేను చాలా ఫీల్‌ అయ్యాను అమర్‌. పాపం భాగీ ఇంకెంత హర్ట్‌ అయిందో.

చంభా: (మనసులో) ఓర్నీ మీ వేషాలు ఎంత నటిస్తున్నారండి

అమర్‌: తను నన్ను హర్ట్‌ చేసిన దానికంటే నేనేం తనని హర్ట్‌ చేయలేదు.

మనోహరి: తెలియక తప్పు చేసింది క్షమించొచ్చు కదా

అమర్‌: నేను ఎప్పటికీ తనను క్షమించను

మనోహరి: అలా అంటే ఎలా చెప్పు మీరు ఎంతైనా భార్యాభర్తలు. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసిపోయి కాపురం చేసుకోవాలి

చంభా: (మనసులో) తెగేదాకా లాగకు మనోహరి. మళ్లీ సార్‌ మనసు మారింది అంటే నీ కొంప కొల్లేరు అవుతుంది

అనుకుంటుంది. అమర్ కోపంగా భాగీని తిట్టి వెళ్లిపోతాడు. నాకు కావాల్సింది ఇదే అమర్ అని మనసులో అనుకుని హ్యపీగా ఫీలవుతుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!