Nindu Noorella Saavasam Serial Today Episode: రాథోడ్‌ తనకు నిద్ర వస్తున్నా పిల్లలను మాత్రం నిద్రపోనివ్వకుండా చదివిస్తుంటాడు. అటూ ఇటూ తిరుగుతూ ఉంటే యాదమ్మ మాత్రం డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని కునికిపాట్లు పడుతుంది. అప్పుడే అంజు కోపంగా చూస్తూ..

రాథోడ్‌: చూడండి పిల్లలు ఎగ్జామ్స్‌ దగ్గర పడుతున్నాయి. మీరు బాగా చదవాలి

అంజు: నువ్వు ఇలా మా ముందు తిరుగుతూ ఉంటే మాకు కాన్‌సంట్రేషన్‌ రావడం లేదు రాథోడ్‌

ఆనంద్‌: అవును రాథోడ్‌ నువ్వు అటూ ఇటూ తిరగకుండా ఒక చోట కూర్చోవచ్చు కదా

ఆకాష్‌: కుదురుగా కూర్చుంటే మాకు కాన్‌సంట్రేషన్‌ వచ్చి చదువుకుంటాం రాథోడ్‌

రాథోడ్‌: కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది బాబు

అంజు: అప్పుడు నిద్రపో రాథోడ్‌ మేము కూడా నిద్ర పోతాం

రాథోడ్‌: నేను నిద్రపోను.. మిమ్మల్ని ఎవ్వరినీ నిద్ర పోకుండా చదివిస్తాను. రాథోడ్‌ ఆన్‌ డ్యూటీ

అంజు: ( మనసులో) ఇంట్లో డాడీ లేనప్పుడు బాగానే డ్యూటీ చేస్తావు

రాథోడ్‌: ఏంటమ్మా గునుగుతున్నావు ఓసారి డాడీకి ఫోన్ చేయమంటావా..?

అంజు: ఏమీ వద్దులే చదువుతాను

యాదమ్మ: నాకు నిద్ర వస్తుంది నేను వెళ్లి పడుకోనా రాథోడ్‌

రాథోడ్‌: పిల్లలు మేల్కొని చదువుతున్నారు నీకు నిద్ర వస్తుందా..? పిల్లలు నిద్ర పోయేంత వరకు నువ్వు నిద్ర పోకూడదు.. అయినా నువ్వు మాకు పనిమనిషివా..? లేక మేము నీకు పనిమనుషులమా..? నోరు మూసుకుని మెలుకువగా ఉండు.. మీరు చదవండి

అప్పుడే భాగీ కాల్‌ చేస్తుంది. అంజు లిఫ్ట్ చేస్తుంది.

భాగీ: ఏం చేస్తున్నారు అంజు

అంజు: రాథోడ్‌ చండశాసనుడిలాగా మారిపోయి మాతో బలవంతంగా చదివిస్తున్నారు మిస్సమ్మ..

భాగీ: ఎగ్జామ్‌ దగ్గరకు వస్తున్నాయి కదా చదవాలి అంజు

అంజు: చదువు విషయలో మీ పెద్ద వాళ్లంతా ఒకేమాట ఉంటారు కదా..?

భాగీ: మీరు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని మా ఆశ. ఇంతకీ భోజనం చేశారా..?

అంజు: ఇందాకే తిన్నాం.. నువ్వు డాడ్‌ గొడవ పడటం లేదు కదా..?

భాగీ: లేదు.. బుజ్జమ్మ ఏం చేస్తుంది

అంజు: నా పక్కనే ఉంది ఇస్తున్నాను.. మాట్లాడు..

భాగీ: హలో చిట్టి తల్లి ఎలా ఉన్నావు

అమర్‌ డోర్‌ ఓపెన్ చేసి భాగీ మాటలు వింటుంటాడు.

అమర్‌: ఎవరితో ఫోన్‌ మాట్లాడుతుంది

భాగీ: ఐ మిస్‌ యూరా బంగారం

అమర్‌: బంగారమా..?

భాగీ: సారీరా బంగారం నీకు దూరంగా ఉండాలని నాకు మాత్రం ఉంటుందా..? చెప్పు.. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాను

అమర్: ( మనసులో) దూరంగా ఉంటున్నాను అంటుందంటే నా కూతురుతో మాట్లాడుతుందా..?

భాగీ: నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నాన్న

అమర్‌: దొంగముఖంది.. నాకు తెలియకుండా నా కూతురును ఎక్కడో దాచి పెట్టి ఇప్పుడు నేను లేను అనుకుని దొంగచాటుగా నా కూతురుతో ఫోన్‌ మాట్లాడుతుంది. చెప్తా..

బయటకు వెళ్లి రాథోడ్‌కు కాల్‌ చేస్తాడు.

రాథోడ్‌: సార్‌ ఫోన్‌ చేస్తున్నారేంటి..? మిస్సమ్మ పిల్లలతో లైన్‌లోనే ఉంది. అంటే సారు మిస్సమ్మ ఒక ప్లేస్‌లో లేరా… (అనుకుంటూ బయటకు వెళ్లి కాల్‌ లిఫ్ట్‌ చేస్తాడు.) చెప్పండి సార్‌ కాశ్మీర్‌ ఎలా ఉంది

అమర్‌: కాశ్మీర్‌ ఎప్పటిలాగే చల్లగా ఉంది కానీ ఏం చేస్తున్నావు రాథోడ్‌

రాథోడ్‌: పిల్లలను చదివిస్తున్నాను సార్‌

అని చెప్పగానే.. అయితే సరే కానీ నువ్వు వెంటనే మన ఆఫీసుకు ఫోన్‌ చేసి భాగీ ఫోన్‌ ట్రాప్‌ చేయమని చెప్పు తను నాకు తెలియకుండా నా కూతురుతో కాల్ మాట్లాడుతుంది. ఫోన్‌ ట్రాప్‌ చేస్తే నా కూతురు ఎక్కడుందో తెలిసిపోతుంది అని చెప్పగానే.. రాథోడ్‌ సరే సార్‌ అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!