Nindu Manasulu Serial Today Episode గణ ప్రేరణకు డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని అంటాడు. నా సంతకం ఎందుకు అని ప్రేరణ అంటే నా ఆస్తి మీద మా నాన్న నా పేరుతో పాటు నీ పేరు మీద కూడా రాశాడు. అది ఇద్దరి పేరు మీద రిజిస్టర్ అయింది.. అది నేను అమ్మాలి అంటే నీ సంతకం కూడా కావాలి అందుకే అడిగా సంతకం పెట్టు అని డాక్యుమెంట్స్ ఇస్తాడు.

గణ ప్రేరణతో సంతకం ఫ్రీగా పెట్టాల్సిన అవసరం లేదు నీకు ఇరవై లక్షలు ఇస్తాను అని అంటాడు. సరిపోకపోతే ఇంకో పది కలిపి ఇస్తా అని అంటాడు. సరే పెడతాను అని ప్రేరణ అంటే గణ సుధాకర్‌తో ఇదంతా డబ్బుకి అమ్ముడు అయ్యే బ్యాచ్ అంటాడు. ప్రేరణ గణతో సంతకం పెడతా కానీ నా డౌట్ క్లియర్‌ చేయ్.. ఈ ఆస్తి పేపర్ల మీద మా నాన్న నీ పేరుతో పాటు నా పేరు కూడా రాశాడు ఎందుకంటావ్.. నేను సంతకం పెడితే కానీ అమ్మడానికి అవ్వదు అన్నావ్ ఎందుకంటావ్.. అంటే నీకు తెలుసు కదా.. మా నాన్న నా పేరు రాయించారు అంటే నేను ఆయన పేరు కాబట్టి.. నువ్వు నా సంతకం అడుగుతున్నావ్ అంటే నేను రాజశేఖరం కూతురు అన్నట్లు నువ్వు ఒప్పుకున్నట్లే కదా అని అంటుంది. నేను మా చెల్లి రాజశేఖరం కూతుళ్లమే అని మా నాన్నే చెప్పాలి అని అన్నావ్.. మా నాన్న నోటితో చెప్పలేకపోయినా ఈ డ్యాక్యుమెంట్స్ చెప్తున్నాయ్.. అది నువ్వు ఒప్పుకోవాలి.. ఎక్కడ మా పరువు తీశావో అక్కడికి వచ్చి ఇందిర రాజశేఖరం భార్య, ప్రేరణ, ఐశ్వర్య ఆయన కూతుళ్లు అని నువ్వు చెప్పాలి అని అంటుంది.

గణ కోపంగా అది ఈ జన్మలో జరగదు అని అంటాడు. అయితే నేను సంతకం పెట్టను అని ప్రేరణ అంటుంది. పెట్టి తీరాలి.. అయినా నా పేరు పక్కన నీ పేరు ఉంది అంటే అర్థం మా నాన్న మిమల్ని ఒప్పుకున్నాడని కాదు.. మీ అమ్మ మా నాన్నతో నీ పేరు ఆస్తిలో పెట్టించింది.. అక్రమ సంతానానికి ఓ ఆధారం కల్పించిందని అర్థం.. అంతే కానీ నువ్వు రాజశేఖరం బిడ్డవి అని కాదు.. సరే అయితే నేను సంతకం పెట్టను అని ప్రేరణ అనడంతో గణ డాక్యుమెంట్స్ చింపేస్తాడు. అవసరం అయితే ఆ ఆస్తి వదులుకుంటా కానీ నిన్ను రాజశేఖరం బిడ్డగా ఒప్పుకోను అని అంటాడు. ఎలా ఒప్పుకోవో నేను చూస్తా అని ప్రేరణ అంటుంది. మీకు మాకు మంచి రోజులు రాబోతున్నాయి నాన్న మీకు త్వరలోనే నయం అయిపోతుంది. మీరు మా దగ్గరకు వచ్చేస్తారు మనం కలిసే ఉంటాం అని ప్రేరణ తండ్రికి బొట్టు పెడుతుంది.

ప్రేరణ కోసం సిద్ధూ బయట వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఎక్కడికి మేడం అని అంటే నీకు ట్రీట్ ఇస్తా కాఫీ తాగుదాం పద అని అంటుంది. ఇంటికి వెళ్లే ముందు కోపంగా ఉన్నారు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు ఈ ఇళ్లు ఎవరిది మేడం అని అడుగుతాడు. కానీ అంతలోనే నాకు అవసరం లేదు అని అన్నారు కదా అని సరే పదండి అని అంటాడు. గణ, సుధాకర్ కలిసి మినిస్టర్ దగ్గరకు వస్తారు. మినిస్టర్‌ని సాయం అడగాలి అంటే ఏదోలా ఉందని గణ అంటాడు. సుధాకర్ ఒప్పించి వెళ్లమని చెప్తాడు. గణ వెళ్తూ వెళ్తూ వీడి ముందు మినిస్టర్‌తో తిట్లు తినడం అవసరమా అని సుధాకర్‌ని అక్కడే ఉండమని అంటాడు. సుధాకర్ గణ వెళ్తుంటే నువ్వు నన్ను ఎందుకు వద్దు అన్నావోనాకు తెలుసురా నా ముందు నీకు తిట్లు పడతాయి అనే కదా.. ఎస్‌ఐ రేంజ్‌రా నాది కానీ నువ్వే నన్ను తొక్కేస్తున్నావ్ అని నాకు తెలుసు అని అనుకుంటాడు.

గణ మినిస్టర్‌ దగ్గరకు వెళ్తాడు. ఎక్కడ చూసినా నీ పేరే వినిపిస్తుంది. అయినా అంత కోపం నీకు ఏంటిరా అని అడుగుతాడు. మీరు నాకు సాయం చేయాలి సార్ అని 50 లక్షలు అడుగుతాడు. నువ్వు నా వీడియో రాకుండా చేశావ్ అందుకు నేను నీకు ప్రమోషన్ ఇప్పించా.. ఇప్పుడు నీతో నాకు ఏం పని లేదు వెళ్లవయ్యా వెళ్లు అని గణని పంపేస్తాడు. గణ బయటకు వెళ్తే సుధాకర్ డబ్బు ఇచ్చారా సార్ అంటే ఇచ్చాడురా పెద్ద సంచి తెమ్మన్నాడు తెద్దాం పద అని అంటాడు. ఇంతలో గణకి విజయానంద్ కాల్ చేస్తే ఎవరు అని సుధా అడిగితే నా బాయ్‌ఫ్రెండ్ మాట్లాడుతావా అని గణ అంటాడు.

విజయానంద్ గణతో ఏదో పెద్ద కేసులో కూరుకుపోయావంట.. నీ ముఖం ఇప్పుడు చూడాలి అని అనిపిస్తుంది. నీలాంటి వాళ్లకి ఒంటి మీద యూనిఫాం ఉంటేనే విలువ.. అయినా నీకు డబ్బు సర్దుకునే టైం అయింది కదా వెళ్లి ఆపని చేసుకో ఆల్‌ది బెస్ట్ అంటాడు. ప్రతీ ఒక్కడు నాతో ఆడుకునే వాడే నీతో సహా అని గణ సుధాతో అంటాడు.

ప్రేరణ, సిద్ధూ కాఫీ షాప్‌కి వస్తారు. నేనే కాఫీ స్పాన్సర్ చేస్తున్నా అని ప్రేరణ చాలా జోష్‌తో చెప్తుంది. మేడం చాలా జోష్‌లో ఉన్నారు.. కొంప తీసి సివిల్స్ రాకుండానే కలెక్టర్ అయిపోయారా అని అడుగుతాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మంచి రోజులు అందరికీ వస్తాయి అని చెప్తుంది. మీ మాటలు ఏం అర్థం కావడం లేదు అని సిద్ధూ అంటే కొన్ని అర్థం కాకపోవడమే మంచిది అంటుంది. ఇక కాఫీ బాలేదు అని బేరర్‌కి క్లాస్ పీకుతుంది. కాఫీ ఎలా చేయాలో ఆయనకు చెప్పి రెండు కప్పులు తీసుకురమ్మని చెప్తుంది. ప్రేరణ అత్యుత్సాహం చూసి సిద్ధూ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.