Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 22న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మంజు, విజయ్ షాక్..

ఏఎస్‌పీగా ఛార్జ్ తీసుకున్న సొంత ఊరిలో ప్రేరణ పోస్ట్ తీసుకుందని న్యూస్‌ని మంజుల, విజయానంద్ టీవీలో చూసి షాక్ అవుతారు. మనల్ని ఇబ్బంది పెట్టడానికే ఇక్కడికి వచ్చింది అని విజయ్ అంటే సిద్ధూనే తనని వదిలేశాడు.. తనని పట్టించుకోవడం లేదు మనకి ఎందుకు అని మంజుల అంటుంది. ఆ ప్రేరణ మన జోలికి వస్తే నేను ఊరుకోను అని విజయానంద్ అంటే ఇక తన గురించి మాట్లాడొద్దు అని మంజుల వెళ్లిపోతుంది. విజయానంద్ తనలో తాను ప్రేరణ ఏఎస్‌పీగా చార్జ్ తీసుకుంది అంటే జరిగింది ఏదో మర్చిపోదు.. ఇంతకు ముందులా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అయినా సిద్ధూ ప్రేరణని కలవనంత దూరంగా వెళ్లిపోయాడు కదా.. వాళ్లు కలవరు.. నేను కలవనివ్వను అని అనుకుంటాడు.

నీ మీద యాక్షన్ తీసుకుంటా..

ప్రేరణ, సుధాకర్ డ్యూటీ పని మీద బయటకు వెళ్తూ ఉంటారు. ప్రేరణ అంటూ ఎప్పటిలా సుధాకర్ మాట్లాడితే ప్రేరణ ఏంటి ప్రేరణ మేడం అను అంటూ ప్రేరణ సుధాని భయపెట్టేసి నవ్వుకుంటుంది. తర్వాత సుధాకర్ ప్రేరణకు సిద్ధూ గురించి అడుగుతాడు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు అని అంటుంది. కారు సైడ్‌కి ఆపమని చెప్పి టీ తాగడానికి దిగుతుంది. ఇంతలో ప్రేరణ మీద ఓ రౌడీ అటాక్‌ చేయబోతే సిద్ధూ ఎంట్రీ ఇస్తాడు. ప్రేరణ సిద్ధూని చూసి షాక్ అయిపోతుంది. రౌడీలను సిద్ధూ చితక్కొట్టేస్తాడు. సుధాకర్ కూడా సిద్ధూని చూసి షాక్ అవుతాడు. సిద్ధూ ప్రేరణని కాపాడటానికి మళ్లీ వచ్చావా అని సుధాకర్ అడుగుతాడు. నీ ఓవర్ యాక్షన్ ఆపేయ్ అని సిద్ధూ అంటాడు. ఇక ప్రేరణ సిద్ధూని చూసి కళ్లద్దాలు పెట్టుకుంటుంది. కాపాడినందుకు థ్యాంక్స్ అని ప్రేరణ అంటే నేను చాలా మందికి సాయం చేశా అని సిద్ధూ అంటాడు.

ఐశ్వర్య, రంజిత్‌ల పెళ్లి అలా అయింది..

డాక్టర్ రంజిత్ దగ్గరకు ఓ పెద్దాయన వచ్చి తన చేతిలో రూపాయి కూడా లేదు అని చెప్తారు. ఐశ్వర్య ఈ రోజు ఫ్రీగా చూస్తారు అబద్ధం చెప్పి రంజిత్‌కి విషయం చెప్పి ఆ పెద్దాయనకు వైద్యం చేయిస్తుంది. పెద్దాయన సంతోషంతో మీ ఇద్దరూ భార్యాభర్తలా జంట చూడముచ్చటగా ఉంది అని అంటాడు. దాంతో ఐశ్వర్య మేం ప్రేమ పెళ్లి చేసుకున్నాం అని చెప్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో రంజిత్, ఐశ్వర్యల పెళ్లి సీన్ చూపిస్తారు. ఇక పెద్దాయన ఇద్దరినీ ఆశీర్వదించి వెళ్లిపోతారు.

మా ఆయన మీ ఆయనలా కాదు..

ఐశ్వర్య, రాజశేఖరం లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రేరణ వస్తుంది. ఏంటి అక్క ఇంత లేట్ అయింది.. మీ అత్తారింటికి వెళ్లావా అని అడుగుతుంది. ప్రేరణ ఐశ్వర్య మీద సీరియస్ అవుతుంది. ఇలా మాట్లాడావు అంటే ఏదో ఒక కేసులో పెట్టి అరెస్ట్ చేస్తా అని ప్రేరణ అంటే మా ఆయన చూస్తూ ఉంటాడు అనుకున్నావా.. మా ఆయన మీ ఆయనలా కాదు అని ఐశ్వర్య అంటుంది. ఇక సుధాకర్ సిద్ధూ కనిపించాడు అని చెప్తాడు. అందరూ సంతోషంగా ఇది మంచి న్యూస్ స్వీట్ చేసుకుందాం అంటే స్వీట్ ఏం వద్దు.. ఇది మీకు మంచి విషయం కానీ నాకు కాదు.. అని కోప్పడి వెళ్లిపోతుంది. ఇక ప్రేరణని పై అధికారి ప్రేరణకు ఓ స్పెషల్ కేసు అప్పగిస్తారు. ఈ కేసు విషయంలో ప్రేరణకు తోడుగా ఓ స్పెషల్ ఆఫీసర్‌ని అపాయింట్ చేశాను అని చెప్తారు. తీరా చూస్తే అది సిద్ధూనే.. సిద్ధూ కూడా పోలీస్ అయ్యాడు. అది ఎలా ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.