Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 8న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నా కూతురు ఇంకా దొరకలేదు..

గణ దగ్గరకు ప్రేరణ వచ్చి కొత్త కేసులు ఏమైనా వచ్చాయా అని అడుగుతుంది. ఇంతలో తన కూతురు మిస్సింగ్ అంటూ తిరుగుతున్న పెద్దావిడ మళ్లీ వస్తుంది. ప్రేరణ గణతో ఈ కేసు ఇంకా క్లియర్ చేయలేదా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఎంక్వైరీ చేస్తున్నాను మేడం స్పెషల్ టీంకి చెప్పాను.. క్లీస్‌ వస్తున్నాయి అని అంటాడు. మీ కూతురి గురించి తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్లొద్దు అని ప్రేరణ కేసులో ఇన్వాల్వ్ అవుతుంది.

ఈయన మీకు తెలుసా..

గణకి ఒకరు ఫొటో పంపిస్తారు. వెంటనే గణ ప్రేరణ దగ్గరకు వెళ్లి చూపిస్తాడు. అమ్మాయి మిస్ అయిన తర్వాత ఈయనతో వెళ్లింది.. ఫోన్‌లో లాస్ట్ కాల్ కూడా అబ్బాయితో ఉంది అని చెప్తాడు. దాంతో ప్రేరణ ఆవిడకు ఫొటో చూపించి ఈ అబ్బాయి తెలుసా అని అడిగితే తెలీదు అంటుంది. ప్రేరణ వాళ్లు ఎంక్వైరీ మొదలు పెడతారు.

సిద్ధూ ఎంక్వైరీ..

సిద్ధూ ఓ రౌడీ దగ్గరకు వెళ్లి సిగరెట్ వెలిగించి ఓ ఫోటో చూపించి వీడు ఎవడు అంటాడు. తెలీదు అని మరోరౌడీ అంటాడు. అవునా అని ఆ వ్యక్తితో రౌడీ కలిసి ఉన్న ఫొటో చూపించి అతన్ని పట్టుకొని కొట్టి ఎవరు అని అడుగుతారు. సిద్ధూతో పాటు అతని పోలీసులు కూడా వస్తారు. సిద్ధూ అతన్ని ఎంత అడిగినా చెప్పకపోవడంతో గన్‌తో కాలు మీద కాల్చి అడ్రస్ తెలుసుకుంటాడు.

ముందే తెలుసుకుందాం..

గణ ఎంక్వైరీ చేసి ఇందులో చాలా మంది అమ్మాయిల్నీ ఇలాగే పట్టుకుంటున్నారు అని మాట్లాడుకుంటారు. ఆ రౌడీ ఆట కట్టించాలి అని ప్రేరణ వాళ్లు బయల్దేరుతారు. రౌడీ చాలా మంది అమ్మాయిల్ని కట్టి పడేసి బేరం చేస్తుంటాడు. సిద్ధూ వాళ్లు అక్కడికి చేరుకుంటారు. చాటుగా మొత్తం రెక్కి చేస్తారు. సిద్ధూ ఆ రౌడీలను చితక్కొడతాడు. గన్‌ చూపించి అందరినీ అదుపులోకి తీసుకుంటాడు. అమ్మాయిల జీవితం నాశనం చేయాలి అని చూస్తారా అని కొడతాడు.

లొకేషన్‌లో గణ, ప్రేరణ..

గణ ప్రేరణలు తమ టీంతో అదే లొకేషన్‌కి వస్తారు. సిద్ధూ వాళ్లని చూసి షాక్ అయిపోతారు. నేను చెప్పకుండా నువ్వు ఎలా వాళ్లని పట్టుకుంటావ్.. మాకు వాళ్లని అప్పగించు అని ప్రేరణ, గణ అంటారు. నేను అప్పగించను.. లాకప్‌లో పెడతా అని అనుకుంటారు. ఇద్దరూ వాదించుకుంటూ ఉంటే ఇంతలో రౌడీలు పారిపోతారు. గణ, సిద్ధూ, ప్రేరణ, మిగతా పోలీసులు వాళ్ల వెంట పరుగులు పెడతారు. గణ ఓ రౌడీని ప్రేరణ ఓ రౌడీని పట్టుకుంటారు. మెయిన్ రౌడీని సిద్ధూ పట్టుకుంటాడు. ప్రేరణ కూడా అక్కడికి వెళ్తుంది. గణ అతన్ని పట్టుకొని నీతో ఎవరు ఇలా చేయించారో చెప్పరా అని అంటాడు. రౌడీ తప్పించుకొని పారిపోయే టైంలో అతన్ని లారీ గుద్దేస్తుంది. అతను చనిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.